OnePlus 13s లాంచ్ కంటే ముందే అంచనా ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
OnePlus 13s స్మార్ట్ ఫోన్ ఇండియన్ లాంచ్ గురించి వన్ ప్లస్ టీజింగ్ మొదలు పెట్టింది.
స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది
ఒకచేతిలో చక్కగా సరిపోయే కాంపాక్ట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది
OnePlus 13s స్మార్ట్ ఫోన్ ఇండియన్ లాంచ్ గురించి వన్ ప్లస్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ఫోన్ ను స్లీక్ మరియు ఒకచేతిలో చక్కగా సరిపోయే కాంపాక్ట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క అంచనా ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOnePlus 13s లాంచ్
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13s లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు చెబుతున్న వన్ ప్లస్ ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ చిత్రాలతో టీజింగ్ చేస్తోంది. ఈ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ వివరాలు అర్థం అవుతున్నాయి.
OnePlus 13s : ఫీచర్స్
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది 3nm చిప్ సెట్ మరియు గరిష్టంగా 4.32GHz క్లాక్ స్పీడ్ తో పాటు లేటెస్ట్ AI ఇంజిన్ తో పాటు వస్తుంది. అందుకే, వన్ ప్లస్ ఫోన్ లో ప్రత్యేకమైన AI బటన్ ను కూడా అందించింది. ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న బిగ్ డిజైన్ మాదిరిగా కాకుండా ఈ ఫోన్ ను కాంపాక్ట్ సైజులో అందిస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేసింది.

ఇక ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ నమూనా చిత్రాల ద్వారా ఈ ఫోన్ రీసెంట్ గా చైనా మార్కెట్ లో వన్ ప్లస్ లాంచ్ చేసిన వన్ ప్లస్ 13T స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే, ప్రసుతం ఇండియన్ వేరియంట్ లో కన్ఫర్మ్ చేసిన ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి వుంది.
అందుకే, ఈ ఫోన్ ఫీచర్స్ ను అంచనా వేయడం జరిగింది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు UFS4.0 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ లో ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉండవచ్చు.
Also Read: Realme GT 7 మరియు GT 7T రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
OnePlus 13s : అంచనా ధర
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 45,000 నుంచి రూ. 50,000 ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ మేజర్ ఫీచర్స్ మరియు ప్రైస్ గురించి కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక అప్డేట్ రాలేదు.
గమనిక : పైన అందించిన ప్రధాన చిత్రం వన్ ప్లస్ 13టి స్మార్ట్ ఫోన్ చైనా వేరియంట్ ఇమేజ్ అని గమనించాలి