OnePlus 12 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

OnePlus 12 5G పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది

ఈ వన్ ప్లస్ ఫోన్ ను రూ. 7,000 తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది

వన్ ప్లస్ 12 5జి ఫోన్ భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఉంటుంది

OnePlus 12 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 12 5G పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ వన్ ప్లస్ ఫోన్ ను రూ. 7,000 రూపాయల తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. మంచి డిస్కౌంట్ ఆఫర్ వచ్చినప్పుడు వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 12 5G : ఆఫర్

వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్(12GB + 256GB) ను రూ. 64,999 ధరకు అమెజాన్ లిస్ట్ చేసింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లకు రూ. 7,000 డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఫోన్ హైఎండ్ వేరియంట్ (16GB + 512GB) వేరియంట్ పైన కూడా ఈ ఆఫర్ లభిస్తుంది. Buy From Here

ఈ ఫోన్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఫోన్ భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఉంటుంది.

Also Read: Laptop Deals: భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ ఫోన్ రేటుకే లభిస్తున్న ల్యాప్ టాప్స్.!

OnePlus 12 5G : ఫీచర్లు

వన్ ప్లస్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో తెచ్చింది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 12GB/ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB / 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జత చేసింది. ఈ స్పెక్స్ తో ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ లో 2K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన 6.1 ఇంచ్ పవర్ఫుల్ OLED స్క్రీన్ వుంది.

OnePlus 12 5G Features
OnePlus 12 5G Features

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ ను కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక ప్రో లెవల్ Hasselblad కెమెరా సిస్టం వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-808 మెయిన్ కెమెరా, 64 MP 3X పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా మరియు 48MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇది DSLR వంటి అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలు మరియు వీడియోలను షూట్ చేసే అవకాశం ఇస్తుంది.

ఈ ఫోన్ లో 100W సూపర్ ఊక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5400mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోన్ లో హైపర్ టచ్, 360 డిగ్రీల సరౌండ్ యాంటెనా వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo