Xiaomi Mi A2 కి అందిన ఆండ్రాయిడ్ 10 అప్డేట్

Xiaomi Mi A2 కి అందిన ఆండ్రాయిడ్ 10 అప్డేట్
HIGHLIGHTS

ఇది 1.3 GB పరిమాణంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

షావోమి సంస్థ 2018 సంవత్సరంలో మంచి డ్యూయల్ కెమేరా మరియు ఆండ్రాయిడ్ వన్ తో ఇండియాలో విడుదల చేసినటువంటి మి Mi A2  స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు  ప్రధాన అప్డేట్ అయినటువంటి Android 10 ను అందుకుంది. వాస్తవానికి, విడుదల సమయంలో ఆండ్రాయిడ్ 8.1 తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 2018 సంవత్సరం చివరికల్లా ఆండ్రాయిడ్ 9 ఫై యొక్క ప్రధాన అప్డేట్ ను అందుకుంది. అయితే, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రకటించినటువంటి, ఆండ్రాయిడ్ 10 యొక్క అప్డేట్ అందుకుకోవడానికి మాత్రం చాలాకాలం పట్టిందని చెప్పొచ్చు.

ఇక ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ని Mi A2 కోసం అధికారికంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ముందుగా XDA Developers నివేదించింది. దీని ప్రకారంగా, ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకున్నట్లు చూపిస్తున్న Mi A2 యొక్క ఆండ్రాయిడ్ 10 అప్డేట్ స్క్రీన్ షాట్ ఒక వినియోగదారుడు, Xiaomi Forums లో షేర్ చేసినట్లు చూపిస్తోంది. ఈ అప్డేట్ డిసెంబర్ 2019 సెక్యూరిటీ ప్యాచ్ తో పాటుగా వస్తున్నట్లు మరియు ఇది 1.3 GB పరిమాణంతో ఉన్నట్లు కనిపిస్తోంది.      

ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే, Mi A2 మరియు Mi A3 కోసం ఆండ్రాయిడ్ కెర్నల్ సోర్స్ ని విదుదల చేసినట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ కెర్నల్ విడుదల త్వరలో పూర్తి స్థాయి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అన్ని ఫోన్ల కోసం రావచ్చని సూచిస్తోంది. అయితే, ఈ అప్డేట్ తో VoWiFi కాలింగ్ ఫీచర్ లేకపోవడం, UI లో కొన్ని అవాంతరాలు వంటి కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు XDA యొక్క నివేదిక చెబుతుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo