శామ్సంగ్ గెలాక్సీ M10 & M20 కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ అందుకున్నాయి

HIGHLIGHTS

మొదటి సేల్ కంటే ముందుగానే కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ అందుకుంటున్న గెలాక్సీ M10 & M20 స్మార్ట్ ఫోనులు.

శామ్సంగ్ గెలాక్సీ M10 & M20 కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ అందుకున్నాయి

శామ్సంగ్, గతవారంలో మొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని అధిగమించబడినికి కొత్త M- సిరిస్ నుండి గెలాక్సీ M10 & M20 లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోనులు,ఫిబ్రవరి 5 న మొదటిసారిగా అమ్మకానికి వుండనుండగా, దాని కంటే ముందుగానే ఒక కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ అందుకుంటున్నాయి. ఈ అప్డేట్, కొన్ని రివ్యూ ఫోన్లు అందుకోవడాన్ని గమనించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ కొత్త అప్డేట్ కొన్ని మెరుగుదలలు మరియు బగ్ ఫిక్స్ ల కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్ M105FDDU1ASA7 ఫర్మ్ వేర్ తో ఉన్నటువంటి    గెలాక్సీ M10 మరియు M205FDDU1ASA9 ఫర్మ్ వేర్ తో ఉన్నటువంటి గెలాక్సీ M20 కోసం జనవరి సెక్యూరిటీ ప్యాచ్ గా తీసుకొచ్చింది. అయితే, దీని ద్వారా ఎటువంటి గమనించదగ్గ పెరఫార్మెన్సు ఇంప్రూవ్ మెంట్ కనిపించలేదు. అలాగే, ఈ అప్డేట్  గెలాక్సీ M10 కోసం 64.7MB సైజుతో ఉండగా గెలాక్సీ M20 కోసం 102MB గా ఉంటుంది.                               

శామ్సంగ్ గెలాక్సీ M10 స్పెసిఫికేషన్స్

ఈ గెలాక్సీ M10, 19:9 యాస్పెక్ట్ రేషియో గల ఒక 6.22- అంగుళాల HD+ ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఈ ఇన్ఫినిటీ – V డిస్ప్లే అనేది డిస్ప్లే పైభాగంలో V-ఆకారంలో వుండే,  ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలెనే కనిపిస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.6GHz వద్ద క్లాక్ చేయబడిన Exynos 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 2GB + 16GB స్టోరేజి మరియు 3GB + 32GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు దీని  స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది.. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు గల ఒక 5MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  3400mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్  ఫీచరుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా    ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది.        

 శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్

ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. అదనంగా, ఈ శామ్సంగ్ గెలాక్సీ M20, HD స్ట్రీమింగ్ కోసం WideVine L1 దృవీకరణతో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ ఫిచరుతో, వీడియో మరియు ఆడియోని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo