ఇప్పుడు Redmi Note 8 Pro స్మార్ట్ ఫోన్ Flipkart నుండి కూడా సేల్ అవుతోంది

ఇప్పుడు Redmi Note 8 Pro స్మార్ట్ ఫోన్ Flipkart నుండి కూడా సేల్ అవుతోంది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart ‌లో కూడా సేల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది

ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

Redmi Note 8 Pro గత ఏడాదిలో ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈ స్మార్ట్ ఫోన్  అమెజాన్ మరియు మీ.కామ్ ‌లో సేల్ చెయ్యబడింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart ‌లో కూడా సేల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.

రెడ్మి నోట్ 8 ప్రో, ఫ్లిప్ ‌కార్ట్‌లో 6 జీబీ + 64 జీబీ వేరియంట్‌ ని రూ .15,999 ధరకు, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .16,999 ధరకు మరియు మూడవ వేరియంట్  8 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ .18,999 ధరతో లిస్ట్ చేసింది.

రెడ్మి ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ రెడ్మి నోట్ 8 ప్రో సేల్ గురించి ప్రకటించింది. ఈ ట్వీట్ ‌లో "శుభవార్త! # RedmiNote8Pro ఇప్పుడు lFlipkart నుండి అందుబాటులో ఉంది. ఈ రోజు కొనండి. " అని ప్రకటించింది.

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

ఈ రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo