కేవలం రూ.8,999 ధరకే మోటోరోలా వన్ యాక్షన్ ట్రిపుల్ కెమేరా ఫోన్

HIGHLIGHTS

ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది.

కేవలం రూ.8,999 ధరకే మోటోరోలా వన్ యాక్షన్ ట్రిపుల్ కెమేరా ఫోన్

మోటరోలా ఒక అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరాతో ట్రిపుల్ రియర్ కెమేరా ఫోన్ అయినటువంటి మోటోరోలా యాక్షన్ వన్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, చూడడానికి మోటో వన్ విజన్ మాదిరిగా కనిపిస్తుంది కానీ వెనుక మూడు కెమేరాలతో  మరియు ఇది రూ. 13,999 ధరతో విడుదలయ్యింది. అయితే, flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన నిర్వహిస్తున్న రిపబ్లిక్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.8,999 రూపాయల ధరకే అమ్ముడు చేస్తోంది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటరోలా వన్ యాక్షన్ : అఫర్ ధర

మోటరోలా వన్ యాక్షన్ (4GB + 128GB ) ధర – Rs. 8,999

ఈ ఫోన్ కేవలం ఈ ఒక్క వేరియంట్ తో మాత్రమే లాంచ్ చేయబడింది.    

మోటరోలా వన్ యాక్షన్ ప్రత్యేకతలు

మోటరోలా వన్ యాక్షన్ ఒక 6.3-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080 × 2520 పిక్సెళ్ళ FHD + డిస్ప్లే మరియు 21: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్ ఉంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోను యొక్క స్టోరేజిని 512GB కి వరకూ పెంచవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ అందించబడుతుంది.

ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక f /1.8 అపర్చరు కలిగిన 12 MP ప్రధాన కెమెరా మరియు 5MP డెప్త్ కెమెరాతో పాటుగా f/2.2 అపర్చరు గల ఒక 16MP అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరా  కూడా  ఉంటుంది. ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం f/2.0 అపర్చరుతో ఒక 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది డెనిమ్ బ్లూ మరియు పర్ల్ వైట్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది. 

మోటరోలా వన్ యాక్షన్ ఆండ్రాయిడ్ 9.0 పైన పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా వుంటుంది. ఈ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. అలాగే, కనెక్టివిటీ ఎంపికల గురించి చూస్తే, ఈ పరికరం డ్యూయల్ 4G VoLTE , వైఫై 802.11 ఎసి (2.4 Ghz + 5 Ghz ), బ్లూటూత్ 5, జిపిఎస్ + గ్లోనాస్, NFC , USB  టైప్-సి, 3.5 mm ఆడియో జాక్ మరియు ఎఫ్‌ఎం రేడియోతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 160.1 x 71.2 x 9.15mm మరియు 176 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo