Note 5 Stylus : తన మొట్టమొదటి స్టయిలస్ నోట్ విడుదల చేసిన ఇన్ఫినిక్స్

Note 5 Stylus : తన మొట్టమొదటి స్టయిలస్ నోట్ విడుదల చేసిన ఇన్ఫినిక్స్
HIGHLIGHTS

ఈ నోట్ 5 స్టయిలస్, 18W స్పీడ్ ఛార్జింగుకు సపోర్ట్ చేయగల ఒక 4000 mAh బ్యాటరీతో వస్తుంది.

ఈ రోజు జరిగిన, ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇన్ఫినిక్స్ తన మొట్టమొదటి స్టయిల్స్ నోట్ విడుదల చేసింది. ఈ కోతగా విడుదల చేసిన ఈ నోట్ "నోట్ 5 స్టయిలస్" సరికొత్త 'X' పెన్నుతో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కార్యక్రమంలో ఇన్ఫినిక్స్ మొబైల్ ఇండియా యొక్క CEO అయినటువంటి, అనీష్ కపూర్ మాట్లాడుతూ, "ఇన్ఫినిక్స్ కంపెనీ వినియోగదారులు కోరుకునే అన్ని ఆప్షన్స్ కలిగిన ఒక ఫోన్ బడ్జెట్ ధరలో అందచడానికి చేసిన కృషి  ఫలితమే ఈ  NOTE 5 Stylus. ఇది ఒక సరికొత్త 'X' పెన్నుతో మరియు ఈ ధర విభాగంలో ఒక స్టయిలస్ ను వినియోగదారులకు అందించడం సంతోషంగా ఉందని" చెప్పారు. 

ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టయిలస్ ధర : రూ. 15,999 
2018, డిసెంబర్ 5 వ తేదీన ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అమ్మకానికిరానుంది.

      
ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టయిలస్ ప్రత్యేకతలు 

ఈ  ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టయిలస్ 18:9 ఆస్పెక్ట్ రేషీయోతో 1080×2160 పిక్సెల్ రిజల్యూషన్ అందించగల, ఒక 5.93 అంగుళాల 2.5 D కర్వ్డ్ ఫుల్ HD+ ఫుల్ వ్యూ డిస్ప్లే కలిగివుంటుంది. ఈ నోట్ పూర్తి మెటల్ బాడిని కలిగి ఉంటుంది మరియు 500 NITS బ్రైట్నెస్ అందిస్తుంది.ఇది MTK P23 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసరుకు జతగా ARM Mali G71 GPU శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమోరిని కలిగివుంటుంది. ఈ నోట్ లో ప్రత్యేక ఆకర్షణ ఇచ్చినటువంటి X Pen, కేవలం 20 సెకన్ల చార్జింగుతో 90 నిముషాల వరకూ పనిచేస్తుంది మరియు 4,096 సెన్సుతో  రాసేటప్పుడు చక్కని అనుభూతిస్తుంది మరియు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 తో నడుస్తుంది.   

ఇక కెమేరా విభాగానికి వస్తే, వెనుక భాగంలో f/1.8 ఆపేర్చేరు గల ఒక 16 MP సింగిల్ కెమెరాని ఒక డ్యూయల్ LED ఫ్లాష్ తో అందించారు. ఇది AI పోర్ట్రైట్, HDR, బ్యూటీ, ప్రొఫెషనల్, నైట్ మరియు పనోరమాలకు మద్దతునిస్తుంది. అలాగే,  f/2.0 అపెర్చరుతో ఒక 16MP కెమెరాని కూడా ముందు భాగంలోఅందించారు. ఇది AI బొకేహ్, AI బ్యూటీ వైడ్ సెల్ఫీలకు మద్దతునిస్తుంది. సింగిల్ కెమెరా, అయినా కూడా ఇది గూగుల్ లెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది కాబట్టి పోర్ట్రైట్ ఫోటోలను చక్కగా తీసుకోవచ్చు. ఈ మొత్తం ప్యాకేజీకి ఒక పెద్ద 4,000mAh బ్యాటరీతో శక్తినిస్తుంది.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo