నోకియా నుండి కొత్తగా విడుదలకానున్న X71 స్మార్ట్ ఫోన్, ఈ ఏప్రిల్ 2 న తైవాన్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇప్పుడు ఈ నోకియా X71 Geekbench బ్రౌసర్ లో దర్శనమిచ్చింది. నోకియా X71 ఒక స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ మరియు 6GB ర్యామ్ తో Geekbench లో కనిపించింది.
Survey
✅ Thank you for completing the survey!
ముందుగా వచ్చిన నివేదికల ప్రకారం, ఇది ఒక 48MP ప్రధాన వెనుక కెమెరాతో, ఒక కెమెరా-సెంట్రిక్ డివైజ్ గా రానున్నదని తెల్సుతుంది. అయితే, ఈ 48MP సెన్సార్ సోనీ లేదా శామ్సంగ్ సెన్సార్ ని వినియోగిస్తుందా అనే దానిపై ఎలాంటి నిర్ధారణ లేదు. డిస్ప్లే పరంగా, ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ తో రానున్న, సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా దీని గురించి చెప్పవచ్చు. దీన్ని నోకియా 8.1 ప్లస్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యవచ్చని ఊహిస్తున్నారు.
ఈ GeekBench బ్రౌసర్ అందించిన లిస్టింగ్ ప్రకారం, HMD Global NokiaX 71 గా లెబల్ చేయబడింది మరియు ఒక ఆక్టా కోర్ CPU కలిగిన స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ ఒక 6GB ర్యామ్ తో కనిపించింది. ఇది బాక్స్ నుండి వస్తూనే, ఆండ్రాయిడ్ 9 ఫై తో నడుస్తుందని అంచనా వస్తున్నారు. ఇందులో అందించిన ఫలితాల ప్రకారంగా, ఈ నోకియా X71 సింగిల్ కోర్ టెస్ట్ పైన 1450 స్కోరును మరియు మల్టి కోర్ టెస్ట్ పైన 5075 స్కోరును ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల షావోమి నుండి అదే ప్రాసరుతో వచ్చిన రెడీమి నోట్ 7 సింగిల్ కోర్ టెస్ట్ పైన 1642 స్కోరును మరియు మల్టి కోర్ టెస్ట్ పైన 5796 స్కోరును అందించింది.
ఈ లాంచ్ ఈవెంట్ ఒక 120 డిగ్రీ వైడ్-కోన్ లెన్స్ వంటి ఫోన్ యొక్క కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్లను హైలైట్ చేస్తుంది, ఇది సెకండరీ సెన్సార్ కోసం ఉపయోగించబడుతుంది. గతంలో వెల్లడైన ఈ ఫోన్ యొక్క కొని చిత్రాలు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్పుతో వచ్చింది. కానీ ముందు చెప్పినట్లుగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ హ్యాండ్ సెట్ యొక్క చైనీస్ వేరియంట్ ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగి ఉన్నట్లు ఊహించబడింది, అయితే నోకియా 8.1 ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది.
నోకియా 8.1 ప్లస్ పైన మునుపటి నివేదికలు, ఈ హ్యాండ్సెట్ను 6.22-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇది స్నాప్డ్రాగెన్ 710 SoC చేత శక్తినివ్వగలదు మరియు ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది. ఎప్పటిలాగే, నోకియా 8.1 ప్లస్ కూడా ఒక Android One పరికరంగా ఉంటుంది, అయితే చైనాలో ప్రారంభించిన నోకియా X71 కు ఇది వర్తిస్తుంది.