Nokia: మరొక సరసమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 23 Mar 2023 16:43 IST
HIGHLIGHTS
  • నోకియా ఇండియాలో మరొక సరసమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

  • Nokia C12 Pro ప్రస్తుతానికి నోకియా ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ స్టోర్ ల్లో మాత్రమే లభిస్తోంది

  • Nokia C12 Pro బేసిక్ వేరియంట్ రూ.6,999 ధరతో లాంచ్ చేసింది

Nokia: మరొక సరసమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.!
Nokia: మరొక సరసమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.!

నోకియా ఇండియాలో మరొక సరసమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇటీవల ఇండియాలో Nokia C12 ను విడుదల చేసిన నోకియా ఇప్పుడు ఈ ఫోన్ యొక్క Pro వెర్షన్ ను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా Android 12 (Go edition) OS తో పాటుగా మరిన్ని  అకర్షణీయమైన ఫీచర్స్ మరియు డిజైన్ తో వచ్చింది. Nokia C12 స్మార్ట్ ఫోన్ నోకియా ఆఫ్ లైన్, ఆన్లైన్ స్టోర్ నుండి మరియు అమెజాన్ నుండి సేల్ అవుతుండగా, Nokia C12 Pro స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రస్తుతానికి నోకియా ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ స్టోర్ ల్లో మాత్రమే లభిస్తోంది.   

Nokia C12 Pro: ధర

Nokia C12 Pro స్మార్ట్ ఫోన్ ను 2GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేసిక్ వేరియంట్ రూ.6,999 ధరతో లాంచ్ చేసింది. 3GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499. 

Nokia C12 Pro: స్పెక్స్

నోకియా సి12 ప్రో స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఇందులో  5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ Unisoc SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జతగా 3GB ర్యామ్ కి జతగా 2GB వర్చువల్ RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Nokia C12 స్మార్ట్ ఫోన్  Android 12 (Go edition) OS పైన పనిచేస్తుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగిల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 4,000mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, 4G VoLTE, Wi Fi, బ్లూటూత్ 5.2, 3.5 mm ఆడియో జాక్ ను కలిగివుంది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

Nokia C12 Pro launched in india

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు