Nokia 110 4G: రూ.3,000 లోపు ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది
నోకియా భారతదేశంలో కొత్త 4G ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టింది
Nokia 110 4G పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది
ఈ ఫీచర్ ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది
భారతదేశంలో నోకియా తన కొత్త 4G ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ను మార్కెట్లో ప్రస్తుతం వున్నా చాలా ఫీచర్ ఫోన్లకు గట్టి పోటీఇవ్వనుంది. Nokia 110 4G పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ 4G ఫీచర్ ఫోన్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ కొత్త నోకియా ఫోన్ జూన్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడినా, ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫీచర్ ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది మరియు 3,000 రూపాయల కన్నా తక్కువ రేటుకే ఇండియాలో లాంచ్ అయ్యింది.
SurveyNokia 110 4G: Price
Nokia 110 4G ఫీచర్ ఫోన్ రూ.2,799 రేటుతో విడుదల అయ్యింది. ఈ ఫోన్ పసుపు, నలుపు మరియు ఆక్వా కలర్ అప్షనలలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 24 న మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు నోకియా ఆన్లైన్ సైట్స్ ద్వారా లభిస్తుంది.
Nokia 110 4G: ఫీచర్స్
నోకియా 110 4 జి ఫోన్ 1.8-ఇంచ్ QVGA (120×160 పిక్సెల్స్) కలర్ డిస్‌ప్లేను కలిగివుంది. ఈ హ్యాండ్‌సెట్ Unisoc T107 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 128 MB ర్యామ్, 48 MB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 32GB వరకూ విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో 0.8 మెగాపిక్సెల్ VGA కెమెరా ఉంది. ఈ ఫోన్ Series 30+ OS (ఆపరేటింగ్ సిస్టమ్) తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ 1020 mAh రిమూవల్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 13 రోజుల స్టాండ్‌బై సమయం, 16 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు 5 గంటల 4 జి టాక్‌టైమ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్లో టెక్స్ట్ ను వాయిస్ గా మార్చే Redit ఫీచర్, MP3 ప్లేయర్ మరియు మరిన్ని ఫీచర్లతో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
