Motorola Edge + లో 108MP ప్రధాన కెమేరాని కన్ఫర్మ్ చేస్తున్న నమూనా చిత్రాలు

Motorola Edge + లో 108MP ప్రధాన కెమేరాని కన్ఫర్మ్ చేస్తున్న నమూనా చిత్రాలు
HIGHLIGHTS

ఇది పంచ్-హోల్ డిస్ప్లే కలిగిన ఒక కర్వ్డ్ డిస్ప్లే ని చూపిస్తుంది.

మోటరోలా ఈ ఏడాది తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోన్ను విడుదల చేయనుంది. అంతేకాదు, దీని పేరును మోటరోలా ఎడ్జ్ + అని కూడా తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్ యొక్క నమూనా  చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి మరియు ఇప్పుడు, మరిన్ని ఎక్కువ నమూనా చిత్రాలు కూడా లీక్ అయ్యాయి. వీటిని పరిశీలిస్తే, ఈ స్మార్ట్ ఫోన్  ఎలా ఉంటుందో అనే అవగాహన మనకు కలిగిస్తుంది. ఇది పంచ్-హోల్ డిస్ప్లే కలిగిన ఒక కర్వ్డ్ డిస్ప్లే ని చూపిస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ యొక్క లీకైన లేటెస్ట్ ఇమేజిలను వెల్లడించడానికి ట్విట్టర్‌ ని మార్గంగా ఎంచుకున్న ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ద్వారానే ఈ రెండర్‌ లు కూడా వచ్చాయి. మోటరోలా ఎడ్జ్ + వివో నెక్స్ 3 మరియు హువావే మేట్ 30 ప్రో మాదిరిగానే వంగిన ప్యానల్‌ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, ఇది ఫిజికల్  వాల్యూమ్ బటన్లను కలిగి ఉంటుంది. వెనుక కెమెరా సెటప్ ప్రక్కనే 108MP  బ్రాండింగ్ చూడవచ్చు. మోటరోలా ఫ్లాగ్‌ షిప్ ఫోనుకు ‘బర్టన్’ లేదా ‘రేసర్ టర్బో’ అనే సంకేతనామం కోడో ఉంది.

మోటరోలా ఎడ్జ్ + ఒక 6.67-అంగుళాల Full-HD + (1080 x 2340 పిక్సెల్స్) డిస్ప్లేను పంచ్-హోల్ నాచ్‌ తో కలిగి ఉందని రూమర్ ఉంది. చిత్రాలలో, మోటరోలా వన్ విజన్ కంటే ఈ పంచ్ -హోల్ యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ సెట్ ద్వారా శక్తినివ్వనుంది. ఇది 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో వస్తుందని చెబుతున్నారు. ఇంకా, ఇది 5170mAh బ్యాటరీని ప్యాక్ చేయవచ్చు. అయితే, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఇంకా మాటలు లేవు.

ఈ ఫోన్ను గీక్‌బెంచ్‌ లో కూడా గుర్తించారు. ఇది సింగిల్-కోర్ పరీక్షలో 4106 స్కోరు సాధించింది మరియు మల్టీ-కోర్ పరీక్షలో 12823 స్కోరును నమోదు చేసింది. మోటరోలా ఎడ్జ్ + ఆండ్రాయిడ్ 10 ను అమలు చేసే అవకాశం ఉంది. స్మార్ట్‌ ఫోన్ యొక్క ఇతర లక్షణాలు ఇంకా తెలియరాలేదు. అయినప్పటికీ, దీని లాంచ్ తేదీకి దగ్గరగా ఉన్నందున మరిన్ని వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయని మేము ఆశిస్తున్నాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo