ఇంటెల్ యొక్క కొత్త 5G Modems సిద్ధం

ఇంటెల్ యొక్క కొత్త 5G Modems సిద్ధం
HIGHLIGHTS

2020 నాటికీ ఉత్పతులలో వాడకానికి రావచ్చు.

గత రెండు సంవత్సరాల్లో 5G అనేది అధికంగా వాడబడుతూన్నపదం, ఎవరు ముందుగా తయారుచేసి, మార్కెటింగ్ చేస్తారనే విషయంపైన ఇంటెల్, క్వాల్కామ్ మరియు అనేక ఇతర టెలికాం పరిశ్రమలు భారీగా దీనిపైన అంచనాలను అందిస్తున్నాయి.  ప్రతి బ్రాండ్ కూడా ఈ విజయాన్ని వినియోగదారుల కోసం తయారు చేసే తుది పరికరాల విషయంలో కాకుండా, 5G రేడియోను వేగంగా OEM లకు ఎవరు డెలివర్  చేయగలరు అని చూస్తున్నాయి . తన నూతన XMM 8160 5G మోడెమ్ సిద్ధంగా ఉంది మరియు 2019 చివరి నాటికి తయారీదారులకు విడుదల అవుతుందని ఇంటెల్ చెబుతోంది.

ఇంటెల్ నుండి ఈ కొత్త XMM 8160 5G మోడెమ్ బహుళ-మోడ్ రేడియో చిప్, స్మార్ట్ఫోన్లు, PC లు మరియు బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ గేట్వేలు వంటి పలు రకాల పరికరాలకు 5G కనెక్టివిటీని అందించడానికి ఆప్టిమైజ్ చేయబడింది. ఈ మోడెమ్ 6gbps యొక్క గరిష్ట వేగాన్ని ప్రస్తుత LTE మోడెమ్ల కన్నా మూడు నుండి ఆరు రెట్లు వేగంగా చేయగలదు. అదనంగా, ఈ కొత్త చిప్ 4G, 3G మరియు 2G స్పెక్ట్రామ్లకు మద్దతుగా అదనంగా 5G కొత్త రేడియో ప్రమాణాలకు స్వతంత్ర   మరియు అస్వతంత్ర వివరణలకు కూడా మద్దతు ఇస్తుంది.

Intel-Xmm-8160-modem-2.jpg

ఈ మోడెమ్ సిద్ధంగా కలిగివుండి కూడా, దురదృష్టవశాత్తు ఇంకా ఇంటెల్ కోసం ఇది సరైన విజయం కాదు. క్వల్కామ్ దాని స్నాప్డ్రాగెన్ X50 5G NR మోడెమ్లపై కూడా తీవ్రంగా కృషి చేస్తోంది మరియు అదే సమయంలోపల ఇంటెల్ వలనే మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. ఇంటెల్ దాని పనిని కట్ చేసుకుంది, అయితే క్వాల్కామ్ ఇప్పటికే దాని మోడెమ్ కోసం 18 ప్రధాన స్మార్ట్ఫోన్ తయారీదారులను కలిగి ఉంది, ఇంటెల్, ఇప్పుడు కేవలం ఆపిల్ ని మాత్రమే కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆపిల్ ప్రత్యేకంగా 2018 ఐఫోన్ నమూనాలలో ఇంటెల్ యొక్క రేడియోలను ఉపయోగించింది మరియు క్వల్కామ్ తో కపెర్టినో సంస్థ ఒక తీవ్రమైన న్యాయ పోరాటంలో లాక్ చేసింది, అయితే ఇంటెల్ యొక్క వ్యాపారం ఇప్పుడు సురక్షితంగా ఉంది.

సాంకేతిక పరిజ్ఞాన సామర్ధ్యం కారణంగా వాడకం విషయంలో,  స్పెక్ట్రం వాడటం వలన 5 జి టెలికాం పరిశ్రమలో పెద్ద విషయంగా నిలిచింది. క్వాల్కామ్, ఇంటెల్ మరియు శామ్సంగ్ కూడా తమ 5G టెక్నాలజీలను ఉపయోగించి స్మార్ట్-సిటీ కాన్సెప్టులను ప్రదర్శించాయి, ఇది చాలా మంచి భవిష్యత్తును ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఇది నిజ జీవితానికి ఎలాగ పరిణామం చేయబడిందో ఇంకా వేచిచూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo