Poco X8 Pro Max: అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

భారత్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి పోకో సిద్ధమయింది

Poco X8 Pro Max స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో పవర్ ప్యాక్ ఫోన్ గా తీసుకొస్తుంది

అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ తో వచ్చే స్మార్ట్ ఫోన్ లలో ఒకటి

Poco X8 Pro Max: అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Poco X8 Pro Max: భారత్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి పోకో సిద్ధమయింది. అదే పోకో ఎక్స్ 8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో పవర్ ప్యాక్ ఫోన్ గా తీసుకొస్తుంది. రీసెంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రకటించిన కంపెనీ ఈరోజు ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది. ఫీచర్లు చూసిన ఎవరైనా సరే అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ తో వచ్చే స్మార్ట్ ఫోన్ లలో ఒకటిగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి చెబుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco X8 Pro Max: లాంచ్ డేట్?

పోకో ఎక్స్ 8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ మార్చి 17వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

Poco X8 Pro Max: కీలక ఫీచర్లు

పోకో ఎక్స్ 8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ హార్ట్ అండ్ బ్రెయిన్ గురించి కంపెనీ వివరాలు వెల్లడించింది. అంటే, ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ మరియు ర్యామ్ గురించి కంపెనీ వివరాలు రివీల్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ రీసెంట్ గా విడుదల చేసిన Dimensity 9500s చిప్ సెట్ తో లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఇది 3nm టెక్నాలజీ కలిగిన ప్రోసెసర్ మరియు ఇది గరిష్టంగా 3.1Mn (31 లక్షలు) కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది.

Poco X8 Pro Max Features

కేవలం చిప్ సెట్ మాత్రమే కాదు ఇందులో ఈ ప్రోసెసర్ ను మరింత చక్కగా హ్యాండిల్ చేసే LPDDR5X Ultra ర్యామ్ మరియు UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను గరిష్టంగా 24GB ర్యామ్ తో అందిస్తుందని కూడా పోకో తెలిపింది. ఈ ఫోన్ కలిగిన ఈ రెండు స్పెక్స్ తో ఈ ఫోన్ BGMI, COD, Asphalt Legends, రియల్ రేసింగ్ 3, స్టాండ్ ఆఫ్ 2, మొబైల్ లెజెండ్స్ వంటి 20 కంటే ఎక్కువ హెవీ గేమ్స్ ని 120fps వద్ద చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయగలదని పోకో తెలిపింది.

ఈ ఫోన్ కలిగిన హెవీ ప్రోసెసర్ మరియు ఇతర స్పెక్స్ తో వేగంగా పని చేస్తుంది. ఇంత వేగంగా పని చేసేటప్పుడు, ఫోన్ వేగంగా హీట్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణం. అందుకే, ఈ ఫోన్ ను చల్లగా ఉంచడానికి ఇందులో పోకో 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టం అందించింది. ఇది ఫోన్ ను చల్లగా ఉంచడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో గొప్ప గేమింగ్ కోసం వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా అందించింది.

Also Read: POCO C85x 5G: బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యింది.!

ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ అవసరమైన సమయంలో ఎక్కువ బ్రైట్నెస్ తో ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసే అడాప్టివ్ బ్రైట్నెస్ ఫీచర్ కలిగిన డిస్ప్లే ఇందులో ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 24x జూమ్ రిజల్యూషన్ టచ్ వంటి ఫీచర్ తో గొప్ప HDR గేమింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ ఫాలెన్ యొక్క ఈ ఫీచర్స్ మాత్రమే పోకో అఫీషయల్ గా రివీల్ చేసింది. అయితే, ఈ ఫోన్ 8400 mAh బిగ్ బ్యాటరీ మరియు చాలా వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, ఈ ఫోన్ ను అత్యంత శక్తివంతమైన ఫోన్ గా ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile