POCO C85x 5G: బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యింది.!
పోకో ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యింది
పోకో ఈ ఫోన్ ను కేవలం రూ. 10,999 రూపాయల అతి తక్కువ ధరలో లాంచ్ చేసింది
POCO C85x 5G: పోకో ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యింది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోను విడుదల చేసిన ప్రైస్ సెగ్మెంట్లో ఊహించని పీక్ స్పెక్స్ ఈ ఫోన్ ను అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో యొక్క లేటెస్ట్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది.
SurveyPOCO C85x 5G: ప్రైస్
పోకో ఈ ఫోన్ ను కేవలం రూ. 10,999 రూపాయల అతి తక్కువ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బేసిక్ 4 జీబీ + 64 జీబీ ను ఈ ప్రైస్ తో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను కూడా కేవలం రూ. 11,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు గ్రీన్ యూదు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
POCO C85x 5G: ఫీచర్స్
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో ధరలో పెద్ద 6.9 ఇంచ్ HD+ డిస్ప్లే తో విడుదలైన 5జి ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 HBM బ్రైట్నెస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.95mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది 6 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్. ఈ ఫోన్ లో 4జీబీ ఫిజికల్ ర్యామ్, 4జీబీ అదనపు ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో వెనుక 32MP ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 6300 mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 7.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది.
Also Read: Boat 5.1 Dolby Soundbar అమెజాన్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ తో నెవర్ బిఫోర్ ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ లో గొప్ప సౌండ్ అందించే 200% వాల్యూమ్ స్పీకర్ సెటప్ కూడా అందించింది. ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ ఫీచర్స్ చూస్తుంటే, బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యిందని అనిపిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile