200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!

మోటరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 200MP భారీ కెమెరాతో తీసుకురాబోతోంది. ఈ విషయం గురించి మోటోరోలా స్వయంగా వెల్లడించింది.  చైనీస్ సోషల్ సైట్ Weiboలో బ్రాండ్ నుండి రాబోయే 200MP ఫోన్‌ గురించి టీజ్ చేసే పోస్టర్‌ను మోటరోలా షేర్ చేసింది. ఈ టీజర్ లో నేరుగా చెప్పకుండా 200MP గురించి అర్థమొచ్చేలా సూచించింది. ఈ టీజర్ లో "200-మిలియన్ పిక్సెల్ చిత్రాల యుగానికి" స్వాగతం అని వెల్లడించింది. వాస్తవానికి, 200ఎంపి కెమెరా ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు మోటరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ అతిపెద్ద కెమేరాతో రాబోతున్నట్లు మనం విన్నాం. దీనికి “Frontier” అనే పేరును సూచిండం మనం నెట్టింట్లో చూశాం.

మునుపటి లీక్ ఫ్రాంటియర్ స్మార్ట్‌ఫోన్ గురించి చాలా తక్కువగా సమాచారాన్ని వెల్లడించగా, లేటెస్ట్ నమూనా చిత్రాలు ఈ ఫోన్ మొత్తం డిజైన్ ను వెలుగులోకి తెచ్చాయి.

Motorola Frontier: అంచనా స్పెక్స్

గతంలో లీకైన మోటోరోలా ఫ్రాంటియర్ లీక్డ్ రెండర్ల ప్రకారం, ఈ ఫోన్ 6.7-అంగుళాల HDR10+ FHD+ 144Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని మేము భావిస్తున్నాము. ముందు భాగంలో 60MP సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు.

కెమెరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 200MP మైన్ సెన్సార్ మరియు రెండు అదనపు లెన్స్‌లను కలిగి ఉంటుంది.  ఇందులో, ఒకటి 50MP Samsung అల్ట్రావైడ్ లెన్స్ కాగా మరొకటి 12-MP సోనీ IMX663 టెలిఫోటో లెన్స్. అంతేకాదు, మోటోరోలా ఫ్రాంటియర్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 Plus SoC యొక్క శక్తితో పనిచేస్తుందని కూడా లీకైన నివేదికలు చెబుతున్నాయి.

అంతేకాదు, 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజీ వరకు ఉంటుంది. ఈ ఫోన్ లో అందించే బ్యాటరీ పరిమాణం 4500mAh మరియు ఛార్జింగ్ వేగం అద్భుతమైన 125 వాట్స్ కావచ్చు. అయితే, ఇవన్నీ కూడా దాదాపుగా ఉచించి చెబుతున్నవే కాబట్టి ఫోన్ విడుదల సమయంలో ఖచ్చితమైన వివరాలను చూడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo