ఇప్పుడు బయట రిటేల్ స్టోర్స్ లో మోటరోలా ఫోనులు

ఇప్పుడు బయట రిటేల్ స్టోర్స్ లో మోటరోలా ఫోనులు

మోటోరోలా ఇప్పటి వరకూ ఆన్ లైన్ స్టోర్స్ లోనే ఫోనులను అమ్ముతుంది. అయితే ఇప్పుడు ఫిజికల్ రిటేల్ స్టోర్స్ లో కూడా అమ్మేందుకు ఆఫ్ లైన్ బిజినెస్ మోడల్ కు ప్రిపేర్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటోరోలా చెయిర్ మ్యాన్ ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం వెల్లడించారు. దీనితో పాటు ఆన్ లైన్ అలానే కంటిన్యూ చేస్తారని చెప్పారు.

మోటోరోలా ను లెనోవో కంపెని గూగల్ నుండి కొనటం జరిగింది. అంతకముందు గూగల్ మోటోరోలా ను కొన్నాది. అప్పటి నుండి ఆన్ లైన్ లో కంపెని మార్కెట్ షేర్ చాలా అధికంగా ఉంది. కాని xiaomi వంటి కంపెనీల రాకతో సేల్స్ తగ్గాయి మోటోరోలా కు.

ఇప్పుడు లెనోవో మోటో కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను లెనోవో తో కలపకుండా ప్రీమియం సెపరేట్ బ్రాండింగ్ తో ఫోనులను తయారు చేయనుంది. చైనా లో గత వారం రిలీజ్ అయిన మరో కో లెనోవో బ్రాండ్, ZUK సిరిస్ ను కూడా ఇండియాకి తెచ్చే యోచనలో ఉన్నట్టు చెప్పారు.

అయితే కొన్ని వారాల క్రితమే xiaomi ఇండియాలో Redington రిటేల్ స్టోర్స్ ద్వారా బయట కూడా ఫోనులను అమ్ముతుంది అని అనౌన్స్ చేసింది. xiaomi కు పోటీగా అదే బిజినెస్ స్ట్రాటేజి ను లెనోవో అమలు చేస్తుంది అని అర్థమవుతుంది.

ఇండియాలో made in ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా లెనోవో చెన్నై లో స్మార్ట్ ఫోన్స్ తయారు చేసేందుకు ప్లాంట్ ను కూడా నెలకొల్పింది. మోటో E, లెనోవో K3 నోట్ ఆల్రెడీ ఈ ప్లాంట్ లోనే తయారు అవుతున్నాయి.

ఆధారం: ఎకనామిక్ టైమ్స్

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo