Motorola Signature: స్మార్ట్ ఫోన్ కాదు సూపర్ స్మార్ట్ ఫోన్ గా వచ్చింది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 23-Jan-2026
HIGHLIGHTS

Motorola Signature ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ కొత్త ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో సూపర్ ఫోన్ గా అందించింది

ఇందులో 8K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ వంటి అల్ రౌండ్ ఫీచర్స్ ఉన్నాయి

CES 2026 నుంచి సూపర్ ఫీచర్స్ తో మోటోరోలా కొత్త సిరీస్ నుంచి ప్రపంచానికి పరిచయం చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ Motorola Signature ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో సూపర్ ఫోన్ గా అందించింది. ఇందులో 8K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా సెటప్, డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే మరియు BOSE సౌండ్ సపోర్ట్ కలిగిన సౌండ్ సెటప్ తో పాటు లగ్జరీ డిజైన్ వంటి అల్ రౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే, ఈ ఫోన్ ను సూపర్ ఫోన్ గా అభివర్ణించారు. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

Motorola Signature: ప్రైస్

మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. మీ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు క్రింద అందించాము.

మోటోరోలా సిగ్నేచర్ (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 59,999

మోటోరోలా సిగ్నేచర్ (16 జీబీ + 512 జీబీ) ప్రైస్ : రూ. 64,999

మోటోరోలా సిగ్నేచర్ (16 జీబీ + 1 టీబీ) ప్రైస్ : రూ. 69,999

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పాంటోన్ మార్టిన్ ఆలివ్ మరియు పాంటోన్ కార్బన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై రెండు గొప్ప లాంచ్ ఆఫర్స్ మోటోరోలా అందించింది. మొదటిది ఈ ఫోన్ పై అందించిన భారీ రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. రెండోది ఈ ఫోన్ పైన అందించిన రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మార్కెట్ లో ఉన్న చాలా ఫోన్స్ కు స్ట్రాంగ్ ఆపొనెంట్ గా నిలుస్తుంది.

Motorola Signature: ఫీచర్స్

ఇక మోటోరోలా సిగ్నేచర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.8 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ని మోటోరోలా అందించింది. ఈ స్క్రీన్ 165Hz గొప్ప రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 6200 నిట్స్ గొప్ప బ్రైట్నెస్ తో ఉంటుంది. ఇవి కాకుండా ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ కూడా కలిగివుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో అందించింది. ఈ చిప్ సెట్ తో జతగా 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 1 TB హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ మోటోరోలా లేటెస్ట్ Hello UI సాఫ్ట్ వేర్ పై Android 16 OS తో పని చేస్తుంది.

ఈ లేటెస్ట్ మోటో ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP Sony LYT-828 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ ఫోన్ ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరా వుంది. మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ 8K Dolby Vision తో వీడియో రికార్డు చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన మోటో Ai కెమెరా ఫీచర్స్ తో సూపర్ రిజల్యూషన్ ఫోటోలు కూడా అందిస్తుంది.

Also Read: Republic Day 2026 కోసం పోలీసులకు AI Smart Glass చేదోడు.. స్మార్ట్ సర్వైలెన్స్ తో మరింత భద్రత.!

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కేవలం 6.99mm స్లీక్ డిజైన్ లో కూడా 5,200 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W టర్బో పవర్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 10W వైర్లెస్ రివర్స్ ఛార్జ్ కూడా మోటోరోలా అందించింది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వచ్చింది. సౌండ్ పరంగా కూడా ఈ ఫోన్ లో గొప్ప ఫీచర్స్ అందించింది. ఎలాగంటే, ఈ ఫోన్ లో Bose ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా అందించింది.

ఈ ఫోన్ గురించి ఓవరాల్ గా కుదించి చెప్పాలంటే, స్పెక్స్ షీట్ ప్రకారం ఈ ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేసిందని చెప్పవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :