Republic Day 2026 భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు AI ఆధారిత AI Smart Glass ను ఉపయోగించడం టెక్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణ భద్రతా విధానాలకు తోడు ఆధునిక టెక్నాలాజి లను జోడిస్తూ, “స్మార్ట్ సర్వైలెన్స్” దిశగా దేశం వేస్తున్న కీలక అడుగు గా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. పోలీసులు ధరించే ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మరియు రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ వంటి సూపర్ ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్స్ తో ప్రజల సమూహం మధ్య ఉన్న అనుమానితులు లేదా నేరస్తులను క్షణాల్లో గుర్తించే అవకాశం పోలీసులకు లభిస్తుంది. ఇది అచ్చంగా హాలీవుడ్ సైంటిఫిక్ సినిమా లలో చూపించే స్మార్ట్ టెక్ సీన్ ని తలపించేలా ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
Republic Day 2026 : AI Smart Glass
దేశంలో స్మార్ట్ గ్లాసెస్ ను ధరించే మొదటి పోలీస్ ఢిల్లీ పోలీస్ శాఖ నిలుస్తుంది. ఈ రిపబ్లిక్ రోజున రిపబ్లిక్ డే పరేడ్ మార్గాలు, ఎంట్రీ పాయింట్లు మరియు అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో AI స్మార్ట్ గ్లాసెస్‌ను ధరించిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ గ్లాసెస్‌లోని కెమెరా ప్రజల ముఖాలను స్కాన్ చేసి, పోలీస్ డేటాబేస్‌తో పోల్చి చూస్తుంది.
ప్రభుత్వ డేటా బేస్ లో ఉండే ఏదైనా మ్యాచ్ కనిపిస్తే వెంటనే ఈ స్మార్ట్ గ్లాస్ అలర్ట్ వస్తుంది. దీని వల్ల ప్రజలను అనవసరంగా ఆపకుండా చాలా సైలెంట్ అండ్ ఫాస్ట్ సెక్యూరిటీ చెకింగ్ సాధ్యమవుతుంది. ఇదే కాదు కొన్ని స్మార్ట్ గ్లాస్ మోడళ్లలో థర్మల్ సెన్సార్లు కూడా ఉండటంతో, అనుమానాస్పద కదలికలు లేదా ప్రమాదకర వస్తువులు గుర్తించడానికి కూడా సహాయపడుతుంది.
ఈ కొత్త స్మార్ట్ టెక్నాలజీ వినియోగం వల్ల భద్రతా బలగాల పనితీరు మరింత మెరుగవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. CCTV కెమెరాలు, డ్రోన్లు, AI అనలిటిక్స్‌తో కలిసి ఈ స్మార్ట్ గ్లాసెస్ పనిచేయడం ద్వారా మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టం ఏర్పడుతుంది. ఈ కొత్త సామర్ధ్యాల ద్వారా మరింత విస్తృతమైన సెక్యూరిటీ సాధ్యం అవుతుంది. ముఖ్యంగా, భారీ ఈవెంట్లలో మానవ తప్పిదాలు తగ్గడం మరియు నిర్ణయాలు వేగంగా తీసుకునే సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు ఈ కొత్త టెక్ తో మనకు లభించే అవకాశం ఉంది.
మొత్తానికి, ఢిల్లీ పోలీసులు రిపబ్లిక్ డే సందర్భంగా ఉపయోగించే ఈ AI స్మార్ట్ గ్లాసెస్ టెక్నాలజీ తో భవిష్యత్తులో దేశ పోలీసింగ్ యంత్రాంగం ఎలా ఉండబోతుందో చూపించే స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు.