ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన తర్వాత కూడా OnePlus Buds 3 పై సూపర్ డిస్కౌంట్ అందించింది.!

HIGHLIGHTS

OnePlus Buds 3 పై సూపర్ డిస్కౌంట్ అందించింది

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ముగిసిన తర్వాత అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్

ఈ బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్ పై ఒక లుక్కేయండి

ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన తర్వాత కూడా OnePlus Buds 3 పై సూపర్ డిస్కౌంట్ అందించింది.!

ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన తర్వాత కూడా OnePlus Buds 3 పై సూపర్ డిస్కౌంట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ముగిసిన తర్వాత అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో వన్ ప్లస్ బడ్స్ 3 కేవలం 4 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. సేల్ తర్వాత అందించిన ఈ బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Buds 3 : ఆఫర్

వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ రూ. 6,499 రూపాయల ధరతో లాంచ్ కాగా రిపబ్లిక్ డే సేల్ ముగిసిన తర్వాత ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 4,099 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అవుట్ చేసింది. ఈ బడ్స్ ఈ ధరలో గొప్ప ఫీచర్స్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి.

Also Read: Vasantha Panchami 2026 శుభాకాంక్షలు మరియు బెస్ట్ ఇమేజెస్ ప్రత్యేకంగా మీకోసం.!

OnePlus Buds 3 : ఫీచర్స్

వన్ ప్లస్ ఈ బడ్స్ ను 10.4 mm ఊఫర్ మరియు 6 mm ట్వీటర్ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో అందించింది. ఈ సెటప్ తో శక్తివంతమైన బాస్ మరియు క్లియర్ హై అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ 15 Hz నుంచి 40 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ కలిగిన 49dB ANC తో 49 dB వరకు శబ్దాన్ని తగ్గిస్తుంది. అంటే, బయట శబ్దాలు లేకుండా మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 తో వస్తుంది మరియు Google Fast Pair తో పాటు డ్యుయల్ డీజే డివైజ్ కనెక్షన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

OnePlus Buds 3 flipkart sale offers

ఈ ఇయర్ బడ్స్ టోటల్ 44 గంటల ప్లే టైం అందిస్తుంది. ఇది ANC ఆన్ ఉన్నప్పుడు ఒక్కో బడ్ సుమారు 6.5 గంటలు ప్లేబాక్, ANC ఆఫ్ ఐతే సుమారు 10 గంటల ప్లే టైం అందిస్తుంది. ఒక బాక్స్ తో కలిసి టోటల్ 44 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ వన్ ప్లస్ బడ్స్ 4 ms తక్కువ లేటెన్సీ తో వస్తుంది మరియు IP55 రేట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.స్టెమ్‌ పై టాచ్ వాల్యూమ్ కంట్రోల్ మరియు ట్యాప్ జశ్చర్లు ఉపయోగించి ప్లే, పాజ్ మరియు కాల్ వంటి పనులు నిర్వహించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo