మోటరోలా ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా ప్రవేశపెట్టింది. అదే, Moto E32s స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 10 వేల రూపాయల సబ్ కేటగిరి బడ్జెట్ ధరలో ప్రకటించింది. ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో వచ్చినా చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ మోటో e32s ను బడ్జెట్ ధరలో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పెద్ద 5,000mAh బ్యాటరీతో పాటుగా మరిన్ని మంచి ఫీచర్లతో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Moto E32s: స్పెషిఫికేషన్స్
మోటోరోలా Moto E32s పెద్ద 6.5 అంగుళాల HD డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, ఎంటువంటి యాడ్స్ బెడదా లేని బ్లోట్ వేర్ ఫ్రీ Android 12 OS పైన పనిచేస్తుంది.
ఇక కెమెరా పరంగా, Moto E32s ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 16MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది.ఈ ఫోన్ 4G LTE, WiFi, బ్లూటూత్, FM రేడియో, 3.5mm ఆడియో జాక్ మరియు USB-C 2.0 పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Moto E32s: ధర
Moto E32s స్మార్ట్ ఫోన్ ను లాంచ్ అఫర్ లో భాగంగా 3GB+ 32GB వేరియంట్ ను రూ.8,999 ధరతో ప్రకటించింది. మరిక వేరియంట్ 4GB+ 64GB వేరియంట్ ను రూ.9,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ జూన్ 6 నుండి Flipakrt మరియు Reliance Digital నుండి అమ్మకానికి వస్తుంది.