200MP+50MP+12MP భారీ కెమెరా సెటప్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా

200MP+50MP+12MP భారీ కెమెరా సెటప్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా
HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు ఇండియాలో Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 200MP భారీ కెమెరా సెటప్ తో వచ్చింది

మోటోరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్

మోటోరోలా ఈరోజు ఇండియాలో Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 200MP భారీ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ మరియు ఛార్జింగ్ సపోర్ట్ తో సహా అన్ని విభాగాల్లో భారీ ప్రత్యేకతలను కలిగివుంది. మోటోరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలను మరియు విషయాలు ఇక్కడ వున్నాయి. మరింకెందుకు ఆలశ్యం ఈ మోటోరోలా లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం పదండి.         

Motorola Edge 30 Ultra: Price

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.54,999 రూపాయల ప్రారంభధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ నుండి సాల్ అవుతుంది మరియు ఈ ఫోన్ పైన మరిన్ని సేల్ ఆఫర్లను కూడా అందించవచ్చు.  

Motorola Edge 30 Ultra: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 అల్ట్రా  6.67 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ పవర్ ఫుల్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ మరియు స్టార్ లైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 అల్ట్రా యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో  200MP ప్రధాన కెమెరాని OIS సపోర్ట్ తో కలిగివుంది. దీనికి జతగా అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 50MP భారీ సెన్సార్ మరియు 12MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరాతో 30fps లో 8K UHD వీడియోలను, 30/60fps లో 4K UHD వీడియోలను చిత్రీకరించవచ్చు. ముందు భాగంలో కూడా భారీ 60MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ లో అందించింది.

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా లో 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,610 mAh బ్యాటరీని అందించింది. ఇక ఇతర ఫీచర్ల విషయాన్ని వస్తే, ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది. ఈ ఫోన్ IP52 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగివుంది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo