మోటరోలా వన్ విజన్ గూగుల్ ARCore డివైజ్ లిస్టింగులోదర్శనమిచ్చింది : త్వరలోనే లాంచ్

మోటరోలా వన్ విజన్ గూగుల్ ARCore డివైజ్ లిస్టింగులోదర్శనమిచ్చింది : త్వరలోనే లాంచ్
HIGHLIGHTS

మోటో వన్ విజన్ స్మార్ట్ ఫోన్ అతిత్వరలో విడుదలకానునట్లు తెలుస్తోంది.

ఇది శామ్సంగ్ యొక్క 10nm FinFET ప్రాసెస్ తో వస్తుంది.

గూగుల్ యొక్క ARCore వెబ్సైటులోఇచ్చిన లిస్టింగ్ ప్రకారం ఇది త్వరలో విడుదలకానునట్లు, సూచన ప్రాయంగా తెలుస్తుంది.

ఒక 48MP కెమేరా మరియు ఎక్సినోస్ 9610 SoC తో రానున్నట్లు అంచనా.

చాలా కాలంగా పుకార్లతో హోరెత్తిస్తున్న, మోటరోలా యొక్క మోటో వన్ విజన్ స్మార్ట్ ఫోన్ అతిత్వరలో విడుదలకానునట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక రూమర్లతో ఇంటర్నెట్లో గొప్ప అంచనాలనే తీసుకొచ్చింది.అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు  గూగుల్ యొక్క ARCore వెబ్సైటులోఇచ్చిన లిస్టింగ్ ప్రకారం ఇది త్వరలో విడుదలకానునట్లు, సూచన ప్రాయంగా తెలుస్తుంది.  

గూగుల్ లిస్టింగులో ఆండ్రాయిడ్ వన్ పవర్డ్ మోటో వన్ విజన్, అని మాత్రమే ప్రకటించిందే తప్ప మరే విధమైన వివరాలను ప్రకటించలేదు. అయితే, ముందుగా వచ్చిన కొన్ని నివేదికలు ఈ ఫోను యొక్క చాల స్పెక్స్ వెల్లడించాయి. ఈ మోటో వన్ విజన్ శామ్సంగ్ యొక్క ఎక్సినోస్ 9610 SoC తో రావచ్చు మరియు ఇది శామ్సంగ్ యొక్క 10nm FinFET ప్రాసెస్ తో వస్తుంది అని అంచనా వేయబడింది. సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ డిస్ప్లే కలిగివున్నట్లుగా చెప్పబడింది. అలాగే, ఇది కూడా ఒక 48MP వెనుక కెమెరా కలిగిన స్మార్ట్ ఫోనుగా రానున్నట్లు తెలుస్తోంది.             

సెల్ఫీ కెమెరా యొక్క రిజల్యూషన్ గురించిన ఎటువంటి నిర్ధారన ఈ నివేదిక తెలియచేయనప్పటికీ, మునుపటి నివేదికలు ఈ 48MP కెమెరా ఒక డ్యూయల్ కెమెరా సెటప్పుతో రానున్నట్లు మరియు ముందుగా వచ్చిన ఒక ప్రెస్ రెండర్ ఊహాజనిత నిర్ధారణను ధృవీకరిస్తుంది. అధనంగా, ఈ డ్యూయల్ కెమెరా సెటప్, ఒక డ్యూయల్ – LED ఫ్లాష్ తో పైభాగంలో ఎడమవైపు నిలువుగా ఉంచబడుతుంది. ఈ కెమెరా మాడ్యూల్ పక్కన "48MP కెమెరా" టెక్స్ట్ ఉంది. ఇక బ్యాక్ ప్యానెల్ పైన బ్యాట్-వింగ్ లోగోలో వేలిముద్ర స్కానర్ మరియు Android One బ్రాండింగ్ కూడా ఉంది.

ఈ చిత్రం కుడివైపున ఒక స్పీకర్ మరియు ఎడమవైపు ఒక  మైక్రోఫోనుతో,ఇంకా దిగువన ఒక USB-C పోర్ట్ను ఈ ఫోన్లో చూపిస్తుంది. ఈ వన్ విజన్ ఎడమవైపు అంచున ఒక సిమ్ కార్డు స్లాట్ను కలిగి ఉంటుంది, మరియు వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ను కుడివైపు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క లాక్ స్క్రీన్,  ఏప్రిల్ 3 తేదీన ఈ ఫోన్ అధికారికంగా వెల్లడించవచ్చు అన్నట్లుగా సూచించే తేదీని చూపిస్తుంది. ఇంకా, దిగువన ఉన్న ఒక మాత్ర ఆకారంలో ఉన్న బటన్ ఈ ఫోన్ను Android Pie OS తో అమలు అవుతున్నట్లు చెబుతోంది.

ఈ ఫోన్, ఇప్పటికే గీక్బెంచ్ లో  కనిపించింది మరియు సింగిల్ టెస్ట్ లో 1599 స్కోరును మరియు బహుళ కోర్ టెస్టులో 5328 స్కోరును వరుసగా సాధించింది. ఈ ఫోన్ కూడా "Wi-Fi అలయన్స్ వెబ్సైట్" లో ఒక మోడల్ సంఖ్య XT1970-1 మరియు Android Pie  పైన నడుస్తున్న జాబితాలో ఉంచబడింది. ఒక 21: 9 యొక్క ఆస్పెక్టు రేషియోని అందించే డిస్ప్లేతో, ఈ ఫోన్ రానుంది. ఇది 32 GB/64GB / 128GB స్టోరేజ్  మరియు 3GB / 4GB RAM మోడల్లతో పాటు Exynos 9610 SoC యొక్క శక్తితో ఈస్మార్ట్ ఫోన్ పనిచేయనున్నట్లు తెలియచేయబడింది. ఈ మోటరోలా వన్ విజన్ ఒక 3,500mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లో, ఈ ఫోన్ 12MP యొక్క డిఫాల్ట్ చిత్రాన్ని తీసుకోవడంతో ఒక కెమెరా కలిగి ఉంది, కానీ రెడ్మి నోట్ 7 వలె, అదే 48MP గా మార్కెట్ చేయబడుతుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo