Moto G82 5G: ఇండియాలో విడుదలకు సిద్ధమైన మోటో స్మార్ట్ ఫోన్..!!
Moto G82 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది
జూన్ 7 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు మోటోరోలా తెలిపింది
కంప్లీట్ ప్యాకేజ్ గా మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ రాబోతోంది
గత నెల యూరప్ మార్కెట్లో విడుదలైన Moto G82 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 7 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు మోటోరోలా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి, రెండు కాదు కంప్లీట్ ప్యాకేజీగా వస్తుంది. ఎందుకంటే, మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ బిలియన్ కలర్స్ అందించగల 10బిట్ pOLED ను అదీకూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇలా డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ మరియు ప్రాసెసర్ తో సహా కంప్లీట్ ప్యాకేజ్ గా ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క స్పెషిఫికేషన్లతో కూడా టీజింగ్ ను Flipakart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా అందించింది. మరి ఈ అప్ కమింగ్ మోటో స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతోందో చూద్దామా.
SurveyMoto G82 5G:
Flipkart ద్వారా కంపెనీ ఇప్పటికే చాలా కీలకమైన వివరాలను వెల్లడించింది. దీని ద్వారా, మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే సాధారణ 8బిట్ డిస్ప్లే కంటే అధిక రంగులను చూపించగలదని కంపెనీ చెబుతోంది మరియు ఈ డిస్ప్లే పూంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
టీజర్ ప్రకారం కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగిఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ స్పోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
