Moto G31 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు జరగనుంది: బడ్జెట్ ధరలో AMOLED డిస్ప్లే Dolby Atoms తో వచ్చింది

Moto G31 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు జరగనుంది: బడ్జెట్ ధరలో AMOLED డిస్ప్లే Dolby Atoms తో వచ్చింది
HIGHLIGHTS

Moto G31 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు జరగనుంది

బడ్జెట్ ధరలో AMOLED డిస్ప్లే Dolby Atoms తో వచ్చిన Moto G31 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు జరగనుంది. మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను  Dolby Atmos మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటుగా బెస్ట్ ఫీచర్లతో కేవలం రూ.12,999 ధరలోనే  అందించింది. అంతేకాదు,  ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 

Moto G31: ప్రైస్

Moto G31 రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో ఒకటి 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ మరియు దీని ధర రూ.12,999. ఇక మరొక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ మరియు దీని ధర రూ.14,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి జరుగుతుంది.      

Moto G31: స్పెక్స్

మోటోరోలా Moto G31 ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.4 ఇంచ్ FHD AMOLED డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 700 నైట్స్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు వాటర్ రిపెలెంట్ IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకువస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ ఈ ధరలో కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ గా మర్కెట్ లోకి వచ్చింది.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo