Realme Buds Air 8: రియల్‌మీ లేటెస్ట్ బడ్జెట్ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

రియల్‌మీ బడ్జెట్ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

రీసెంట్ గా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రియల్‌మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్స్ తో పాటు రిలీజ్ చేసింది

డ్యూయల్ డ్రైవర్ సెటప్ మరియు LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో ఈ బడ్స్ ను విడుదల చేసింది

Realme Buds Air 8: రియల్‌మీ లేటెస్ట్ బడ్జెట్ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్.!

Realme Buds Air 8: రియల్‌మీ బడ్జెట్ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రియల్‌మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్స్ తో పాటు రిలీజ్ చేసింది. డ్యూయల్ డ్రైవర్ సెటప్ మరియు LHDC వంటి ప్రీమియం ఫీచర్స్ తో ఈ బడ్స్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ కంటే ముందు ఈ బడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds Air 8: ధర

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ ను రూ. 3,799 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ మాస్టర్ గ్రే, మాస్టర్ గోల్డ్ మరియు మాస్టర్ పర్పల్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. రేపు మధ్యాహ్నం, అనగా 2026 జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కొత్త ఇయర్ బడ్స్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ బడ్స్ పై రూ. 200 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో రియల్‌మీ బడ్స్ 8 ఇయర్ బడ్స్ కేవలం రూ. 3,599 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తాయి.

Realme Buds Air 8: ఫీచర్స్

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ డ్యూయల్ డ్రైవర్, అంటే రెం రెండు స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ చిన్న బడ్స్ లో గొప్ప బాస్ సౌండ్ అందించే 11 mm ఉఫర్ మరియు మంచి ట్రెబుల్ అందించే ట్వీటర్ స్పీకర్ ఉంటాయి. ఈ 11mm ఉఫర్ హై ప్యూరిటీ డైఫాగ్రామ్ కలిగి ఉంటే, 6mm ట్వీటర్ N52 మ్యాగ్నెట్ కలిగి ఉంటుంది. అందుకే ఇందులో రిచ్ బాస్ మరియు ప్యూర్ ట్రెబుల్ సౌండ్ ఆశించవచ్చు. ఇక ఈ బడ్స్ బాక్స్ డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ ను సరికొత్త డైమండ్ షేప్ డిజైన్ తో బాడీతో అందించింది. ఇది ఇయర్ బడ్స్ బాక్స్ ఆర్గానిక్ సిలికాన్ వంటి ప్రీమియం మెటీరియల్ తో ఉంటుంది.

Realme Buds Air 8 First Sale

ఈ బడ్స్ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో పాటు సర్టిఫైడ్ ఆడియో తో వస్తుంది. ఈ బడ్స్ లో LHDC 5.0 హై ఫెడిలిటీ ట్రాన్సిషన్ తో పాటు Hi-Res Audio వైర్లెస్ రెండు ఆడియో సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ బడ్స్ గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో సెల్ఫ్ డెవలప్డ్ నెక్స్ట్ అల్గారిథం ఉన్నట్లు కూడా రియల్‌మీ చెప్పింది. బడ్స్ ఎయిర్ 8 ఇయర్ బడ్స్ 3D స్పేషియల్ ఆడియో తో పాటు డైనమిక్ ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది 55dB అల్ట్రా డెప్త్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Also Read: Garmin Quatix 8 Pro: శాటిలైట్ SOS వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ బడ్స్ లో మంచి కాలింగ్ కోసం 6 మైక్ డీప్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించింది. అంతేకాదు, AI ట్రాన్స్లేషన్ మరియు AI ఫేస్ టు ఫేస్ వంటి మరిన్ని AI ఫీచర్స్ కూడా ఈ బడ్స్ లో ఉన్నాయి. ఈ బడ్స్ 58 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ సెటప్ మరియు IP55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo