REDMI Note 14 Pro Plus స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సేల్ కంటే ఒకరోజు ముందు ఈ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను సూపర్ కెమెరా మరియు సూపర్ AI ఫోన్ గా 2024 లో షియోమీ ఇండియాలో అందించింది. ఈ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి చవక ధరలో ఆఫర్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
REDMI Note 14 Pro Plus: ఫ్లిప్ కార్ట్ ఆఫర్
రెడ్ మీ నోట్ 14 ప్రో స్మార్ట్ ఫోన్ 2024 సంవత్సరంలో రూ. 26,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఇదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్, రెండు డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 22,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు.
ఈ ఫోన్ 6.67 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ అండ్ HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ పై గొరిల్లా గ్లాస్ విక్టస్ మరియు వెనుక గొరిల్లా గ్లాస్ 7i కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 4nm ప్రోసెసర్ Snapdragon 7s Gen 3 తో పని చేస్తుంది. ఇందులో 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్’రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో OIS స్టెబిలైజేషన్ కలిగిన 50 MP లైట్ హంటర్ 800 ప్రధాన కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా మరియు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ కెమెరా 30x డిజిటల్ జూమ్, 30FPS 4K వీడియో రికార్డ్, AI కెమెరా ఫీచర్స్ మరియు గొప్ప పోర్ట్రెయిట్ మోడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ భారీ 6200 mAh బ్యాటరీ మరియు 90W హైపర్ ఛార్జ్ వంటి గొప్ప బ్యాటరీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయిల్ స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.