iQOO 15 ను అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుంచి అతి తక్కువ ధరలో అందుకోండి.!
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో ఇటీవల లాంచ్ అయ్యింది
అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది
భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో ఐకూ స్మార్ట్ ఫోన్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో ఇటీవల లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ అండర్ రూ. 75,000 బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అతి తక్కువ ధరలో అందుకోవచ్చని అమెజాన్ ఇప్పుడు ప్రకటించింది. ఐకూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఆఫర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyiQOO 15 : అమెజాన్ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో ఐకూ స్మార్ట్ ఫోన్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. స్మార్ట్ ఫోన్ డీల్స్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ డీల్ ను డిస్ప్లే చేసింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 72,999 ప్రైస్ ట్యాగ్ తో బేసిక్ వేరియంట్ లిస్ట్ అయ్యింది. అయితే, ఇదే ఫోన్ వేరియంట్ రేపు మొదలయ్యే సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 65,999 లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఇదే కనుక జరిగితే ఈ డీల్స్ ఈ సేల్ బిగ్ డీల్ అవుతుంది.
iQOO 15 : ఫీచర్లు
ఇది 2025 చివర్లో విడుదలైన ఐకూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్. ఇది టాప్ పర్ఫార్మెన్స్, గొప్ప గేమింగ్, జబర్దస్త్ కెమెరా మరియు లాంగ్ బ్యాటరీ వంటి టాప్ లెవల్ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో 6.85 అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ 2K LTPO OLED స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు అండర్ డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ సెన్సార్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది iQOO Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్, 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో 50MP (Sony IMX921) మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI ఫోటోగ్రఫీ, నైట్ మోడ్ మరియు పోర్ట్రైట్ మోడ్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 7000mAh బిగ్ సిలికాన్ అనోడ్ బ్యాటరీ, 100W ఫ్లాష్ ఛార్జ్ మరియు 40W వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అందుబాటు ధరలో Haier H5E Series నుండి కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది.!
ఈ ఫోన్ ను వేగంగా చల్లార్చే పెద్ద 8K VC కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ మరియు ఇమర్సివ్ హాప్టిక్ ఫీడ్ బ్యాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లు హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP 69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.