Moto G Max launching tomorrow but know complete features of the phone on today
Moto G Max ప్రీమియం ఫీచర్స్ తో రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గురించి గత వారం రోజులుగా మోటోరోలా టీజింగ్ చేస్తోంది మరియు ఎట్టకేలకు ఈ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు సోనీ కెమెరా వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రేపు విడుదల కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు ఈరోజే తెలుసుకోండి.
మోటో జి మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం అనగా, ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ని కంపెనీ రివీల్ చేసింది.
మోటోరోలా ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ లో భారీ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-STD 810H ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ బిగ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, టర్ టచ్ 2.0 సపోర్ట్ మరియు 1050 HBM నిట్స్ బ్రైట్నెస్ ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడా వస్తుంది.
ఇక ఈ ఫోన్ అంతర్గత ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, బిగ్ LPDDR 5X ర్యామ్, 18GB ర్యామ్ బూస్ట్ మరియు బిగ్ UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. అంతేకాదు, ఇది 2 OS అప్గ్రేడ్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: భారతదేశం స్వాతంత్రోద్యమంలో ప్రాణత్యాగం చేసిన తెలుగు వీరుల AI Images కోసం అద్భుతమైన ప్రాంప్ట్.!
ఈ మోటో ఫోన్ ఆకట్టుకునే కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 50MP Sony LYT 600 + 8MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు మంచి వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు స్టీరియో స్పీకర్ లతో వస్తుంది.