Moto G Max ప్రీమియం ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతుంది .. ఈ రోజే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Moto G Max ప్రీమియం ఫీచర్స్ తో రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ గురించి గత వారం రోజులుగా మోటోరోలా టీజింగ్ చేస్తోంది
ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ని కంపెనీ రివీల్ చేసింది
Moto G Max ప్రీమియం ఫీచర్స్ తో రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గురించి గత వారం రోజులుగా మోటోరోలా టీజింగ్ చేస్తోంది మరియు ఎట్టకేలకు ఈ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు సోనీ కెమెరా వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రేపు విడుదల కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు ఈరోజే తెలుసుకోండి.
SurveyMoto G Max : లాంచ్ డేట్ అండ్ టైం
మోటో జి మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం అనగా, ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ని కంపెనీ రివీల్ చేసింది.
Moto G Max : ఫీచర్స్
మోటోరోలా ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ లో భారీ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-STD 810H ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ బిగ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, టర్ టచ్ 2.0 సపోర్ట్ మరియు 1050 HBM నిట్స్ బ్రైట్నెస్ ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడా వస్తుంది.

ఇక ఈ ఫోన్ అంతర్గత ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, బిగ్ LPDDR 5X ర్యామ్, 18GB ర్యామ్ బూస్ట్ మరియు బిగ్ UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. అంతేకాదు, ఇది 2 OS అప్గ్రేడ్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: భారతదేశం స్వాతంత్రోద్యమంలో ప్రాణత్యాగం చేసిన తెలుగు వీరుల AI Images కోసం అద్భుతమైన ప్రాంప్ట్.!
ఈ మోటో ఫోన్ ఆకట్టుకునే కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో 50MP Sony LYT 600 + 8MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు మంచి వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు స్టీరియో స్పీకర్ లతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
