Moto e40: ఆకట్టుకునే ఫీచర్లతో 10 వేల బడ్జెట్ లో వచ్చింది..!

HIGHLIGHTS

మోటోరోలా తన Moto e40 ను మార్కెట్లోకి విడుదల చేసింది

మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్

బ్లోట్ వేర్ సమస్య లేకుండా వస్తుంది

Moto e40: ఆకట్టుకునే ఫీచర్లతో 10 వేల బడ్జెట్ లో వచ్చింది..!

10 వేల బడ్జెట్ లో వినియోగదారులను ఆకట్టునేలా మోటోరోలా తన Moto e40 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ తో ఎటువంటి బ్లోట్ వేర్ సమస్య లేకుండా వస్తుంది. అధనంగా, ఇది బెస్ట్ క్లాస్ 48MP ట్రిపుల్ కెమెరా, బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి చాలా ఫీచర్లతో అందించింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto e40: ధర

Moto e40 యొక్క మొదటి సేల్ అక్టోబర్ 17 న మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 64GB స్టోరేజ్, 4GB తో వస్తుంది. మరియు ధర Rs.9,499

Moto e40: స్పెషిఫికేషన్స్

మోటోరోలా Moto e40 పెద్ద 6.5 అంగుళాల HD డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు  పొడవుగా 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T700 ఆక్టా కోర్ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో అందించబడింది.    

ఇక కెమెరా పరంగా, Moto e40 ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 48MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది మరియుఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ను కూడా ఇచ్చింది.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile