ట్రెండీ ఫీచర్లతో Micromax In Note 1 మరియు In 1b రిలీజ్: ప్రారంభ ధర రూ.6,999

ట్రెండీ ఫీచర్లతో Micromax In Note 1 మరియు In 1b రిలీజ్: ప్రారంభ ధర రూ.6,999
HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్లను In Note 1 మరియు In 1b అనే పేరుతో విడుదల చేసింది

In Note 1 మరియు In 1b మరిన్నిఫీచర్లతో తీసుకురాబడ్డాయి.

మంచి ట్రెండీ ఫీచర్లు ఈ In Note 1 మరియు In 1b సొంతం

మైక్రోమాక్స్ భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్లను  In సిరీస్ లో భాగంగా In Note 1 మరియు In 1b అనే పేరుతో విడుదల చేసింది. మైక్రోమాక్స్ యొక్క ఈ స్మార్ట్ ఫోన్ల ధర 7,000 రూపాయల నుండి మొదలవుతుంది. మరియు వీటిని మైక్రోమాక్స్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ లో విక్రయిస్తారు. ఈ రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్లు కూడా ప్రస్తుతం ట్రెండీగా నడుసున్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 48MP రియర్ కెమెరా సెటప్ శక్తివంతమైన ప్రోసెసర్ మరియు మరిన్నిఇతర ఫీచర్లతో తీసుకురాబడ్డాయి. అయితే, భారతీయ మార్కెట్లో ఇప్పటికే వున్న ఫోన్లతో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మరియు ఐఎన్ 1 బి ఎలా మరియు ఎంత పోటీ ఇవ్వగలవో చూడాలి.

Micromax In Note 1 మరియు In 1b: ధర

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999 కాగా, 6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సెల్ నవంబర్ 24 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా, In 1b విషయానికి వస్తే, సాధారణ 2GB RAM మరియు 32GB వేరియంట్ రూ. 6,999 రూపాయల ధరతో మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 7,999 రూపాయల ధరతో విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు కూడా ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమాక్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి విక్రయించబడతాయి.

Micromax In Note 1 మరియు In 1b: డిస్ప్లే

మైక్రోమాక్స్ IN నోట్ 1 స్మార్ట్ ఫోన్ పెద్ద  6.7-అంగుళాల FHD డిస్ప్లేను కలిగి ఉంది. అయితే, మైక్రోమాక్స్ ఇన్ 1 బి మాత్రం 6.52-అంగుళాల డిస్ప్లే ఇవ్వబడింది. ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోతో HD + రిజల్యూషన్ డిస్ప్లే. సెల్ఫీ కెమెరాతో స్క్రీన్ పై చిన్న వాటర్‌డ్రాప్ నోచ్ ఇవ్వబడింది.

Micromax In Note 1 మరియు In 1b: కెమెరా

IN నోట్ 1 లో క్వాడ్ రియర్ కెమెరా ఉంది. ఇది 48MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ని కలిగివుంది. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే, ఈ ఫోను‌లో 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాని అందించింది. ఇక రెండవ ఫోన్ In 1b కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇది 13MP + 5MP డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

Micromax In Note 1 మరియు In 1b: ప్రాసెసర్

మైక్రోమాక్స్ IN సిరీస్ స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ ప్రాసెసర్లతో ప్రారంభించబడ్డాయి. వీటిలో, In Note 1 లో మీడియాటెక్ హీలియో జి 85 ప్రోసెసర్ లభిస్తుండగా, బడ్జెట్ ఫోన్ In 1b ఫోన్ మీడియాటెక్ G35 ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది మరియు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్  వాగ్దానంతో వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ‌ఫోను‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.

Micromax In Note 1 మరియు In 1b: బ్యాటరీ

మైక్రోమాక్స్ IN నోట్ 1 మరియు IN 1 బి రెండూ 5000 mAh బలమైన బ్యాటరీని కలిగి ఉంటాయి, ఇది ఈ ఫోన్ల ప్రధాన ఫీచర్లలో ఒకటి. ఈ బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేయగా, IN 1b 10W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు USB టైప్-సి పోర్టుతో వస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి మరియు మార్కెట్ ‌లోని ఇతర 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లతో పోటీపడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo