Xiaomi Mi 12 లో భారీ 200MP కెమెరా

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 02 Jul 2021
HIGHLIGHTS
  • 200 MP భారీ కెమెరాతో వస్తున్న Xiaomi Mi 12

  • ప్రొసెసర్ మరియు కెమెరా సెటప్ కూడా భారీగానే

  • Mi 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రొసెసర్

Xiaomi Mi 12 లో భారీ 200MP కెమెరా
Xiaomi Mi 12 లో భారీ 200MP కెమెరా

200 MP భారీ కెమెరాతో Xiaomi తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Mi 12 కోసం పనిచేస్తోంది. ఈ షియోమి యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రొసెసర్ మరియు కెమెరా సెటప్ కూడా భారీగానే ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కొత్త రిపోర్ట్స్ నిజమైతే గనుక   Mi 12 నిజంగానే భారీ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేలా కనిపిస్తోంది.

Sparrow News అందించిన రిపోర్ట్ ప్రకారం, షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Mi 12 లో భారీ 200MP కెమెరా ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ Mi 12 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రొసెసర్ కలిగి ఉంటుందని మరొక నివేదిక చెబుతోంది. ఈ ఫోన్ లో ఇవ్వనున్న 200 MP భారీ కెమెరా సెన్సార్ ను సామ్సంగ్ మరియు ఒలంపియస్ సిద్ధం తయారు చేస్తాయని కూడా తెలిపింది.

ఇక ఇండియాలో Xiaomi లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Mi 11 Lite. ఈ ఫోన్ యొక్క 6GB మరియు 128GB బేస్ వేరియంట్ రూ.21,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.23,999 ధరతో ప్రకటించబడింది.

ఇక మి 11 లైట్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.55-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10 ప్లేబ్యాక్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు Gorilla Glass 5 ప్రొటక్షన్ కూడా కలిగివుంది.

మి 11 లైట్ కేవలం 6.8 మిల్లీమీటర్ల మందం మరియు అతితక్కువ 157 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ మరియు టుస్కానీ కోరల్ వంటి మూడుచక్కని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Xiaomi Mi 11 Lite స్మార్ట్ న్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 G శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM వరకు మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే ఎంపిక కూడా ఉంది. ఇది MIUI 12 పై పనిచేస్తుంది, ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఉంటుంది.

మి 11 లైట్‌ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, f / 1.79 ఎపర్చరు గల 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు  4,250 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి సపోర్ట్ తో అందించింది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: mi 12 may comes with 200mp camera and sd 895 soc
Tags:
Xiaomi Mi 12 Xiaomi Mi 12 Mi 12 camera 200mp camera mi 12 specs
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
₹ 17999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status