Mi 11X: భారీ ఆఫర్లతో మి 11X మొదటి సేల్
Mi 11X యొక్క మొదటి సేల్
రూ. 3,500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్
E4 AMOLED డిస్ప్లే
షియోమి తన Mi 11 సిరీస్ స్టార్టింగ్ వేరియంట్ Mi 11X ను ఇటీవల ఇండియాలో విడుదల చేసింది. ఈరోజు ఈ Mi 11X యొక్క మొదటి సేల్ జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు జరగనున్న మొదటి సేల్ నుండి చాలా మంచి ఆఫర్లతో వస్తుంది. ఈ ఫోన్ ను 3,500 రూపాయల డిస్కౌంట్ తో కొనుగోలు చెయ్యవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ తో ప్రకటించిన బండిల్ అఫర్ తో Mi Band 5 ను కేవలం 500 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్ లో అందించిన ఫీచర్లు కూడా సూపర్ గా ఉంటాయని చెప్పొచ్చు.
SurveyMi 11X అఫర్ :
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు సులభ EMI ల పైన రూ. 3,500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. బండిల్ అఫర్ తో Mi Band 5 ను కేవలం 500 రూపాయలకే పొందవచ్చు.
Mi 11X : ధర
Mi 11X (6జీబీ + 128 జీబీ ) : రూ.29,999
Mi 11X (8జీబీ + 128 జీబీ ) : రూ.31,999
Mi 11X : ప్రత్యేకతలు
Mi 11X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వుంటుంది మరియు ఇది E4 AMOLED డిస్ప్లే. ఇది 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 7nm ఫ్యాబ్రికేషన్ ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది MIUI 12 ఆధారితంగా వస్తుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.
ఇక కెమెరాల విషయంలో, Mi 11X వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ f/1.79 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్ మరియు 5MP టెలీ మ్యాక్రో సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 20MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 4,520 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. .
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
