LG V40 ThinQ : 5 కెమేరాలు, అద్భుతమైన డిజైన్, ఫుల్ వ్యూ డిస్ప్లే .. ఇంకా మరెన్నో విశేషాలు

LG V40 ThinQ : 5 కెమేరాలు, అద్భుతమైన డిజైన్, ఫుల్ వ్యూ డిస్ప్లే .. ఇంకా మరెన్నో విశేషాలు
HIGHLIGHTS

LG భారతదేశంలో తన LG V40 ThinQ స్మార్ట్ ఫోన్ను దాని సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనుగా ప్రారంభించింది. మల్టీమీడియా విషయంలో నాణ్యతను అందించే విధంగా, ఈ ఫోన్ రూపొందించబడింది.

ఆధునిక స్మార్ట్ ఫోన్లు  కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది ఒక మల్టీమీడియా కేంద్రం, మనము ఫోటోలను తీయడానికి, చలన చిత్రాలను చూడటానికి, సంగీతాన్ని మరియు ఇటువంటి మరిన్నివాటికీ వీటిని ఉపయోగిస్తాము. వాస్తవానికి, ఫోన్ కాల్స్ చేయడం అనేది చాలా మంది వినియోగదారులకు ఇప్పుడు ఒక ప్రాధమిక అవసరం మాత్రం కాదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, LG భారతదేశంలో తన  LG V40 ThinQ స్మార్ట్ ఫోన్ను దాని సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనుగా ప్రారంభించింది. మల్టీమీడియా విషయంలో నాణ్యతను అందించే విధంగా, ఈ ఫోన్ రూపొందించబడింది.

గతంలో వచ్చిన చాలా LG ప్రధాన స్మార్ట్ ఫోన్ల మాదిరిగా, ఈ V40 ThinQ కొన్ని అద్భుతమైన ఫీచర్లతో నిండిపోయింది. ఈ ఫోన్ అందించే ప్రత్యేకతల పైన ఒక లుక్  వేద్దాం.

5 కెమెరాలు

lg ThinQ.jpeg

LG, ఒక స్మార్ట్ ఫోనులో కెమెరా ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకుంటుంది. అందుకనే,  ఈ LG V40 ThinQ స్మార్ట్ ఫోనులో మొత్తం ఐదు కెమెరాలను  అందిస్తుంది. దీనిలో వెనుక వైపు ఒక ట్రిపుల్-కెమెరా సెటప్ మరియు ముందు ఒక డ్యూయల్ -కెమెరా సెటప్ ఉంటుంది. వెనుక కెమెరా కాన్ఫిగరేషన్ ప్రామాణికత చూస్తే, సూపర్ వైడ్, మరియు టెలిఫోటో లెన్సులు కలిగి ఉంటుంది. కాబట్టి,  మీరు పరిస్థితి ఆధారంగా కావాల్సిన విధంగా ఎంచుకోవచ్చు. మీకు చాలా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతే, ఈ ట్రిపుల్ ప్రివ్యూ ఫీచర్ మీ కంటికి కనిపించే వాటి యొక్క ప్రత్యక్ష ప్రివ్యూను చూస్తుంది, కాబట్టి మీరు వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవచ్చు. అదేవిధంగా, ట్రిపుల్ షాట్ ఫీచర్ ఒకే సమయంలో మూడు లెన్సులను ఉపయోగించి ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది, కాబట్టి మీరు అదే సన్నివేశాన్ని పలు దృక్కోణాలతో  పొందవచ్చు.

ముందుభాగంలో,  మీరు ప్రామాణిక మరియు వైడ్ యాంగిల్ లెన్సులు పొందుతారు. మీ రన్-ఆఫ్-ది-మిల్  సెల్ఫీలను సృష్టించడానికి ఈ ప్రామాణిక లెన్స్ ను  వాడవచ్చు. ఇక వైడ్ -యాంగిల్ లెన్సుతో మీరు ఒకరికొకరు అంటిపెట్టుకునే అవసరం లేకుండా, గ్రూప్ సెల్ఫీలు తీసుకునేలా వీలుకల్పిస్తుంది ఇది బ్యాగ్రౌండ్ ను   మీతో పాటుగా ముఖ్యమైన అంశంగా ఉండేలా,  సెల్ఫీలను తీసుకోవడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఈ రెండు లెన్సులు కూడా మీకు మరియు బ్యాగ్రౌండ్  మధ్య భేదాన్ని కలిపేందుకు కూడా కలిసి పనిచేస్తాయి. అలాగే, బ్యాగ్రౌండ్ అస్పష్టంగా ఉండే బొకే షాట్లు తీయడానికి కూడా ఇవి ఉపయోగించబడతాయి.

ఈ పైన తెలిపి వాటన్నిటిని కలిపి, మీరు మంచి-కంపోజ్ చేయబడిన షాట్లు తీసుకోవటానికి సహాయపడే ఒక AI కూడా ఇందులోఉంది. ఇది మీ ఫోటోలను అలంకరించేలా,  ఒక ఐదు స్టూడియో లాంటి లైటింగ్ ఎఫెక్టులను కూడా ఇందులో వాడవచ్చు.

సన్నగా ఉంటుంది.

lg v40 .jpeg

LG V40 ThinQ మొత్తం ఐదు కెమెరాలను కలిగి ఉండవచ్చు, కానీ చాలా తక్కువ స్థలంలోని జోడించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 7.7mm మందంతో చాల సన్నగా మరియు ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ను వెనుక ప్యానెల్లో జతచేసుకుంది. ఇంకా, ఈ ఫోన్ ఒక అందమైన మరియు కేవలం 169g బరువుతో మరియు పొడవుగా, ఒక FullVison డిస్ప్లేతో పాటుగా ఒక చేతితో కూడా సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఈ LG V409 ThinQ మొరాకన్ బ్లూ మరియు ప్లాటినం గ్రే వంటి కలర్ ఎంపికలతో అందుబాటులో ఉంది. స్టైల్ యొక్క అదనపు డాష్ కోసం,  LG V40 ThinQ యొక్క వెనుక ప్యానెల్లో ఒక మాట్టే ఫినిష్ ఇవ్వడం కోసం కంపెనీ యొక్క సిల్క్ బ్లాస్ట్ ప్రక్రియను కలిగి ఉంది, ఇది చక్కగా కనిపిస్తుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా అందించి.

బిగ్ స్క్రీన్ ఫన్

lg v40 1.jpeg

 

LG V40 ThinQ ఒక 3120 x 1440 పిక్సల్స్ యొక్క QHD + రిజల్యూషన్ అందించగల ఒక 6.4-అంగుళాల QLED OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ OLED టెక్నాలజీకి నిజంగా ధన్యవాదాలు చెప్పోచ్చు, వినియోగదారులు ట్రూ బ్లాక్స్ మరియు మెరుగైన కలర్ వీక్షణను ఆస్వాదించవచ్చు. ఈ LG V40 ThinQ వారి స్మార్ట్ ఫోన్లలో వీడియో కంటెంట్ ని ఎక్కువగా చూసేవారికి మంచి ఎంపికగా ఉంటుంది.

ఇంకా, ఈ ఫోన్ వారి అభిరుచి ప్రకారంగా ఒక కొత్త రెండవ స్క్రీన్ ఎంపికను కూడా అందిస్తుంది. డిస్ప్లే ఆన్ చేయకుండానే, క్లాక్ మరియు నోటిఫికేషన్లను ఒక క్షణంలో తనిఖీ చేయడానికి వినియోగదారులు అనుమతించే ఆల్-ఆన్-డిస్ప్లే అనే మరొక చక్కని ఫీచర్ కూడా వుంది.

కొత్త ఫిచర్లకి నాంది

lg v40 2.jpeg

నాణ్యమైన ఆడియో అనుభవాన్ని అందించడానికి, LG V40 ThinQ లో సంప్రదాయ 3.5mm ఆడియో జాక్నుఅందించాలని సంస్థ నిర్ణయించింది. ఇది వినియోగదారులకు వారి వైర్డు హెడ్ఫోన్లను వాడుకోవాలంటే వాటిని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇంకా, ఈ ఫోన్లు 32-బిట్ హై-ఫై క్వాడ్ DAC ను DTS: X 3D సరౌండ్ సౌండ్ యొక్క మద్దతుతో కలిగి ఉంటాయి.

LG V40 ThinQ లో మొదటిసారి LG G7 ThinQ లో పరిచయం చేసిన Boombox స్పీకర్ సెటప్ను కలిగి ఉంది. ఈ స్పీకర్లు పెద్ద అంతర్గత ప్రతిధ్వని ఛాంబర్లని  కలిగి ఉంటాయి, ఇది ఆడియోని విస్తరించడానికి సహాయపడుతుంది. ఇంకా, మెరుగైన ధ్వని నాణ్యత అందించడానికి LG V40 ThinQ యొక్క సిగ్నేచర్ ఆడియో ట్యూన్ చేయడానికి మెరిడియన్  తో కూడా LG భాగస్వామిగా ఉంది.

ఇంకా మరెన్నో

lg v40 3.jpeg

ఒక బ్యాడ్ పార్ఫర్మెన్స్ నిజంగా యూజర్ యొక్క స్మార్ట్ ఫోను అనుభవాన్ని దెబ్బతిస్తుంది. అయితే,  LG V40 ThinQ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC చేత 6GB RAM వరకు కలిగి ఉంది, ఇది అందంగా మృదువైన పనితీరును కచ్చితంగా అందిస్తుంది. ఇంకా, వినియోగదారులు 128GB  అంతర్గత మెమోరిని కూడా పొండుతారు, ఇది ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు మెమోరిని పెంచుకునేలా చేస్తుంది. ఇంకా, ఈ ఫోన్ స్పీడ్  ఛార్జ్ 4.0 మరియు వైర్లెస్ ఛార్జింగ్ యొక్క మద్దతు కలిగిన 3300mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆ పైన, LG V40 ThinQ ఒక అందమైన మరియు కఠినమైన బిల్డ్ అందిస్తుంది. ఈ ఫోన్ IP68 ద్రువీకరణతో నీరు మరియు ధూళి నిరోధకతను అందిస్తుంది. దీనికి తోడు, ఈ ఫోన్ MIL-STD 810G కంప్లైంట్, కాబట్టి ఇది కొన్ని ఒత్తిడులు మరియు స్క్రాప్లను తట్టుకోగలగాలి.

మీరు ప్రస్తుతం తెలుసుకున్న ప్రకారం, ఈ LG V40 ThinQ ఫోన్ను LG చాల అందంగా మరియు మంచి లక్షణాలు కలిగిన ఒక సమూహంగా అందిస్తుంది. మీరు ఎక్కువగా కంటెంట్ చూసే వారైతే కనుక , ఈ LG V40 ThinQ  మీ పరిశీలనలో ఉంచవచ్చు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo