సగం ధరకే డ్యూయల్ స్క్రీన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్: సేల్ ఎప్పుడో తెలుసా?

సగం ధరకే డ్యూయల్ స్క్రీన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్: సేల్ ఎప్పుడో తెలుసా?
HIGHLIGHTS

Flipkart Big Diwali Sale సేల్ వచ్చేస్తోంది.

Flipkart స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం అద్భుతమైన అఫర్ ప్రకటించింది.

LG G8X హాఫ్ రేట్ స్మార్ట్ ఫోన్ డీల్.

Flipkart Big Diwali Sale సేల్ వచ్చేస్తోంది. ఈ అతిపెద్ద సేల్ అక్టోబర్ 29 నుండి నవంబర్ 4 వరకూ కొనసాగుతుంది. Flipkart ఈ దివాళీ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం అద్భుతమైన అఫర్ ప్రకటించింది. వాస్తవానికి, ఈ అఫర్ గత వారంలో జరిగిన Flipkart సేల్ నుండి కూడా అందుబాటులో ఉంచింది. అయితే, కేవలం సెకన్ల వ్యవధిలోనే ఆ స్మార్ట్ ఫోన్ యొక్క అని యూనిట్స్ అమ్ముడవ్వడం వాల్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. అయితే, ఈసారి డేట్ ముందుగానే ప్రకటించారు కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అదే LG G8X హాఫ్ రేట్ స్మార్ట్ ఫోన్ డీల్.

ముందుగా, ఇండియాలో LG G8X రూ. 49,990 రూపాయల ప్రీమియం ధరతో వచ్చిన డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్. అయితే, GST పెరిగిన తరువాత ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా పెరిగింది. అయితే,  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను ఊహించని విధంగా కేవలం రూ.21,990 రూపాయల అతితక్కువ ధరకే అమ్ముడు చేసింది. కానీ, ఈ ఫోన్ MRP ధర 70,000 రూపాయల నుండి ఈ అఫర్ ధరను చూపిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన  Flipkart Big Diwali Sale నుండి కూడా ఈ LG G8X ని కేవలం రూ.24, 990 రూపాయల ధరతో అమ్మడు చేయనున్నట్లు ప్రకటించింది మరియు ఈ సేల్ నవంబర్ 3 వ తేదికి జరుగుతుంది. అధనంగా, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.          

ఇది కేవలం Limited Period Offer కావడం వలన స్టాక్ ఉన్నంత వరకే ఈ అఫర్ అందుబాటులో ఉంటుందని కూడా ప్రకటించింది. ఈ LG G8X స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ మరియు అద్భుతమైన సౌండ్ తో పాటుగా నీరూ, దుమ్ము నిరోధకత గల IP68 రేటింగ్ తో వస్తుంది.    

lg g8x 650.jpg

LG G8X: ఫీచర్లు

ఎల్‌జి జి 8 ఎక్స్ లో 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + (1080×2340 పిక్సెల్స్) ఫుల్‌విజన్ డిస్‌ప్లే 19.5: 9 యాస్పెక్ట్  రేషియో మరియు 403 PP పిక్సెల్ సాంద్రతతో ఉంటుంది. ఇది 6GB RAM తో జతచేయబడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, వీటిని మైక్రో ఎస్‌డీ కార్డ్ (2 టిబి వరకు) ఉపయోగించి మరింత విస్తరించవచ్చు. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 9 పై నడుస్తుంది.

ఆప్టిక్స్ ముందు, LG G8X డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: f / 1.8 ఎపర్చర్‌తో 12MP ప్రాధమిక కెమెరా సెన్సార్ + సూపర్ వైడ్-యాంగిల్ లెన్స్ మరియు f / 2.4 ఎపర్చర్‌తో 13 / MP సూపర్ వైడ్-యాంగిల్ లెన్స్ సెకండరీ కెమేరాతో వస్తుంది . కెమెరాలలో AI యాక్షన్ షాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి, ఇవి వేగంగా కదిలే యాక్షన్ ను చిత్రించడానికి షట్టర్ వేగాన్ని 1/480 ల వరకు వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఇది 32 ఎంపి సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.

క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్ 3.0 కి మద్దతుతో ఎల్‌జీ జి 8 ఎక్స్ పెద్ద 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు 1.2W స్పీకర్లు ఉన్నాయి మరియు 32-బిట్ హై-ఫై క్వాడ్ డిఎసిని కలిగి ఉంది, మెరిడియన్ ఆడియో ట్యూన్ చేసింది, ఇది అసాధారణమైన సౌండ్ క్వాలిటీని ఇస్తుంది. ఇది IP68 నీరు మరియు ధూళి నిరోధకతతో వుంటుంది.                            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo