Airtel ధమాకా ఆఫర్: తక్కువ ధరలో Netflix OTT తో కొత్త ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!
ఎయిర్టెల్ తన యూజర్ల కోసం కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది
Netflix OTT తో పాటు అన్లిమిటెడ్ లాభాలతో వచ్చింది
ఈ ప్లాన్ రీఛార్జ్ తో Unlimited 5G Data సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు
Airtel ధమాకా ఆఫర్: ఎయిర్టెల్ తన యూజర్ల కోసం కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను గొప్ప ప్రయోజనాలతో అందించింది. Netflix OTT కి ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలతో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ తో డేటా, కాలింగ్ మరియు SMS లాభాలను అందుకోవడమే కాకుండా, మరో రెండు లాభాలను కూడా అందుకోవచ్చు.
SurveyAirtel New Plan:
ఎయిర్టెల్ కొత్తగా తీసుకు వచ్చిన రూ. 1,499 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కాలింగ్, డేటా మరియు మరిన్ని ఇతర లాభాలు కలిగిన అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ గా తీసుకుని వచ్చింది. ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
Also Read: Noise pop Buds: 50 గంటల ప్లే టైమ్ తో కొత్త బడ్స్ తెచ్చిన నోయిస్.!
ఎయిర్టెల్ రూ. 1,499 ప్లాన్
ఎయిర్టెల్ రూ. 1,499 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి పూర్తిగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున 84 రోజులకు గాను 252 GB ల హాయ్ స్పీడ్ డేటాని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ రీఛార్జ్ తో 5జి నెట్ వర్క్ పైన Unlimited 5G Data సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే, రోజుకు 100 SMS ఉపయోగ ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు.

ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ యొక్క బేసిక్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ అందుతుంది. ఈ ప్లాన్ తో ఆల్ డివైన్ నెట్ ఫ్లిక్స్ యాక్సెస్ ను రీఛార్జ్ చేసే యూజర్లు అందుకుంటారు. ఇది మాత్రమే కాదు Apollo 24|7 సర్కిల్ 3 నెలల యాక్సెస్ మరియు ఫ్రీ Wynk Music తో పాటు Free Hello Tunes ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
