Noise Pop buds: నోయిస్ బ్రాండ్ నుండి ఈరోజు కొత్త బడ్స్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. నోయిస్ పాప్ బడ్స్ పేరుతో నోయిస్ అందించిన ఈ బడ్స్ కొత్త ముచ్చటైన డిజైన్ మరియు 50 గంటల ప్లే టైమ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ లేటెస్ట్ బడ్స్ యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Noise Pop buds: Price
నోయిస్ ఈ కొత్త బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల లాంచ్ ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ ను noise.com మరియు Flipkart ద్వారా ఈరోజు నుండే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. నోయిస్ పాప్ బడ్స్ ఫారెస్ట్ పాప్, లీలాక్ పాప్, మూన్ పాప్ మరియు స్టీల్ పాప్ అనే లుగు అందమైన కలర్ ఆప్షన్లలో అందించింది.
నోయిస్ పాప్ బడ్స్ 10mm స్పీకర్ లతో పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుందని నోయిస్ తెలిపింది. ఈ బడ్స్ లో అందించిన క్వాడ్ మైక్ ENC సపోర్ట్ ద్వారా క్రిస్టల్ వాయిస్ క్లారిటీ కాలింగ్ ను అందిస్తుంది, అని కూడా నోయిస్ చెబుతోంది. ఈ లేటెస్ట్ బడ్స్ BT v 5.3 సపోర్ట్ తో వస్తుంది మరియు అంతరాయం లేని కనెక్టివిటీ కి గ్యారెంటీ ఇస్తుంది.
Noise Pop buds Colors
ఇక ఈ కొత్త బడ్స్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ ను చూస్తే, ఈ బడ్స్ పూర్తి కేస్ తో 50 గంటల ప్లే టైమ్ అందిస్తుందని నోయిస్ తెలిపింది. ఈ బడ్స్ కేస్ టైప్ C ఛార్జ్ పోర్ట్ వస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 150 నిమిషాల ప్లే టైం అందిస్తుందని కంపెనీ తెలిపింది.
నోయిస్ పాప్ బడ్స్ IPX5 రేటింగ్ టి వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు కేవలం 39 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile