100MP కెమేరాతో ఏప్రిల్ నెలలో విడుదలకానున్న లెనోవో Z6 ప్రో

100MP కెమేరాతో ఏప్రిల్ నెలలో విడుదలకానున్న లెనోవో Z6 ప్రో
HIGHLIGHTS

"బిలియన్ లెవెల్ పిక్సెల్స్" తో వస్తాయని, సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన, చాంగ్ చెంగ్ వెనోబోలో ప్రకటించారు.

ఈ వారం మొదట్లో, మార్చి 26 న కంపెనీ లెనోవా Z6 ప్రో ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు, సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన, చాంగ్ చెంగ్ వెనోబోలో ప్రకటించారు. అయితే, ఈ ఫోన్ ఎప్పుడు రానున్నది, ఎటువంటి ప్రత్యేకతలు ఉండవచ్చని మాత్రం తెలియచేయలేదు. కానీ ఒక తాజా పోస్ట్ లో, ఈ ఫోన్ ఏప్రిల్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఒక "బిలియన్ లెవెల్ పిక్సెల్స్" తో వస్తాయని అతను తెలియచేశారు, అంటే ఇది 100MP కెమెరాతో రావచ్చని వెల్లడైంది మరియు అటువంటి ఫోన్ను ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ ఇదే కావచ్చు.

ఈ ఫోన్ యొక్క USP అనేది 'హైపర్ విజన్' కెమెరా సెన్సార్ గా హైపర్ వీడియోలను రికార్డ్ చేయడానికి అందిస్తుంది. ఈ టెక్నాలజీ ఏమిటో లెనోవో నిజంగా వివరించలేదు కానీ మీడియా వర్గాల్లో మాత్రం హైప్ చేయబడింది. ఈ ఫోన్ లాంచ్ వాయిదా వేయడం ఇది మొదటి సరికాదు. ఇది ముందుగానే, ఈ ఫోన్ను బార్సిలోనాలో జరిగిన MWC 2019 లో  చూపించనున్నట్లు పేర్కొంది, కానీ అది జరగలేదు. ఈ కార్యక్రమంలో,  క్వాల్కమ్ యొక్క X50 మోడెమ్ ద్వారా అందించబడిన వేరువేరు పరికరాలు మరియు 5G డివైజెస్ తో ముగిసింది.

Lenovo Z6 Pro intext.jpg

అంతేకాక, ఈ సంవత్సరం తరువాత 100MP కెమెరాలతో స్మార్ట్ ఫోన్లను అందించేందుకు చూస్తున్నట్లు,  Qualcomm ఇటీవల Digit తో చెప్పింది. క్వల్కామ్ సంస్థ యొక్క ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్, జడ్ హేప్ ప్రకారం,  కెమెరా సెన్సార్ విక్రేతలు ఇప్పటికే ఈ సంవత్సరం తరువాత విడుదల కానున్నస్మార్ట్

ఫోన్ల కోసం  అత్యధికమైన మెగాపిక్సెల్ సెన్సార్లను అందించడం కోసం పని చేస్తున్నారు.  Qualcomm ఈ సంవత్సరం తరువాత మార్కెట్లో 100 మెగాపిక్సెల్స్ కంటే అధికమైన రిజల్యూషన్ గల కెమెరా సెన్సార్లు మార్కెట్ ని తాకుతాయి మరియు 2020 మధ్యలో 100 మెగాపిక్సెల్ నుండి లెక్కింపును జత చేయడం వంటివి చూడవచ్చని, అయన అన్నారు.

ఇప్పుడు Z6 ప్రో యొక్క స్పెక్స్ విషయానికి  వస్తే, ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ మరియు X50 మోడెమ్ తో  5G వంటి సామర్ధ్యాలను తీసుకువస్తుందని నివేదించబడింది.  క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 ప్రాసెసరుతో ఒక ఫోన్ను ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ అయిన లెనోవా అవతరించింది.  అయితే, ఈ ఫోన్లో 5G మోడెమ్ లేదు. ఈ స్మార్ట్ ఫోన్ను, లెనోవా Z5 ప్రో GT గా పేర్కోవడం జరిగింది, అంతేకాదు 12GB RAM ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo