ట్రిపుల్ కెమెరాతో Lenovo Z5s ని చైనాలో విడుదలచేసింది లెనోవో

ట్రిపుల్ కెమెరాతో Lenovo Z5s ని చైనాలో విడుదలచేసింది లెనోవో
HIGHLIGHTS

ఈ కార్యక్రమంలో, ప్రధాన చిప్సెట్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 తో రానున్న తరువాత స్మార్ట్ ఫోన్ Lenovo Z5 Pro GT గురించి కూడా ప్రకటించింది.

అనేక రూమర్లు మరియు అంచనాల తరువాత ఎట్టకేలకు లెనోవో తన Z5s ని చైనాలలో విడుదలచేసింది. ఈ స్మార్ట్ ఫోన్, లెనోవో యొక్క Z5 సిరీసులో కోత్తగా వచ్చి చేరింది. ఈ సిరీసులో ముందునుండే లెనోవో Z5 ప్రో వుంది. ఈ ఫోన్, ప్రస్తుతం ట్రెండుగా నడుస్తున్న వాటర్ డ్రాప్ నోచ్ మరియు ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పును తన సొంతం చేసుకుంది. అలాగే, ఈ లాంచ్ ఈవెంటులో త్వరలో రానున్న లెనోవో యొక్క తరువాతి స్మార్ట్ ఫోన్ అయినటువంటి  Lenovo Z5 Pro GT కూడా ప్రకటించింది.

లెనోవో Z5s ధర

ఈ లెనోవో Z5s స్మార్ట్ ఫోన్ యొక్క ప్రారంభవేరియంట్ అయినటువంటి 4GB+64GB వేరియంట్  చైనాలో CNY 1,398 (సుమారుగా రూ.14,400) ధరతో ఉంటుంది. అలాగే, 6GB+64GB వేరియంట్ CNY 1,598 (సుమారుగా రూ. 16,400) మరియు 6GB+128 GB వేరియంట్ CNY 1,898 (సుమారుగా రూ. 19,500) ధరతో ప్రకటించబడ్డాయి.

అంతేకాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ ముచ్చటైన మూడురంగులలో లభిస్తుంది – హానీ ఆరంజ్, స్టార్రి బ్లాక్ మరియు టైటానియం క్రిస్టల్ బ్లూ. దీని యొక్క ముందస్తు బుకింగులు కూడా మొదలయ్యాయి మరియు డిసెంబర్ 24 నుండి దీని యొక్క సేల్ మొదలవుతుందని సంస్థ తెలిపింది. అలాగే, ఒక ప్రత్యేకమైన Lenovo Z5s Zhu Yilong కస్టమ్ మోడల్ కూడా వుంది దీని ధర చైనాలో CNY 1,998 ( సుమారుగా రూ. 20,500) గా ఉంటుంది మరియు దీనిని జనవరి 12 నుండి షిప్పింగ్ చేస్తుంది.

లెనోవో Z5s ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

పైన తెలిపినట్లుగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.3 అంగుళాల LTPS డిస్ప్లేలో వాటర్ డ్రాప్ నోచ్ ని కలిగివుంటుంది మరియు ఇది చాల సన్నీ బెజల్లతో వస్తుంది. ఈ స్క్రీన్ను "Microporous Drop Screen" గా లెనోవో కంపెనీ పిలుస్తోంది. ఈ డిస్ప్లే 92.6 స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది,  ఒక 1080×2340 పిక్సెల్స్ మరియు 450 nits ఉన్నతమైన బ్రైట్నెస్ ని ఇస్తుంది. ఈ ఫోన్  2.2Ghz వద్ద క్లాక్ చేయబడిన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా-కోర్ ప్రాసెసర్ జతచేయబడిన అడ్రినో 616 GPU తో వస్తుంది. దీని యొక్క స్టోరేజిని మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు విస్తరించుకోవచ్చు.

Lenovo Z5s colours.jpg

వెనుకభాగంలో, ఈ  లెనోవో Z5s  ఫోన్ గ్రేడియాన్ట్ కలర్ లుక్ మరియు P2i నానో యాంటీ-స్ప్లేట్టర్ కోటింగ్ గ్లాస్ ద్వారా పరిరక్షించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక పైభాగంలో ఎడమ వైపున నిలువుగా మార్చిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ కెమేరాకి క్రిందభాగంలో ఒక ఫ్లాష్ ని కూడా అందించారు మరియు మధ్యభాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. ఈ ట్రిపిల్ కెమెరా సెటప్పు చూడడానికి ముందుగా వచ్చిన P20 Pro వలెనే కనిపిస్తుంది.

దీని యొక్క ప్రధాన కెమేరా, 6P లెన్స్ మరియు f/1.8 ఎపర్చరు కలిగిన ఒక 16MP ప్రధాన సెన్సార్, ఒక 8MP టెలిఫోటో లెన్స్ మరియు ఒక 5MP వైడ్-యాంగిల్  సెన్సార్ కలిగివుంటుంది. ఈ లెనోవో Z5s లో ఎటువంటి నష్టం లేకుండా రెండు రేట్ల జూమ్ చేసుకునేలా ఉపయోగపడే, 'ఆర్క్ సాఫ్ట్ జూమ్ స్మూత్' అల్గారిథం అందించినట్లు కంపెనీ చెబుతోంది. అలాగే, మంచి పోర్ట్రయిట్ ఎఫెక్టుకోసం పనోరమిక్ రియల్ టైం బ్లర్ " పేస్ ట్రాకింగ్ లైట్" కూడా వుంది. ముందుభాగంలో,  f/2.0 ఎపర్చరు కలిగిన  ఒక 16MP సెన్సార్ ఉంటుంది.                            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo