ఈరోజు రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో కూడా విడుదలకానున్నట్లు చెబుతున్నరెండర్ లీక్స్

ఈరోజు రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో కూడా విడుదలకానున్నట్లు చెబుతున్నరెండర్ లీక్స్
HIGHLIGHTS

ఈ విషయం గురించి, ప్రముఖ టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ తన ట్విట్టర్ పేజీలో వివరించారు.

 ఫిబ్రవరి 28 వ తేదీ, అంటే ఈరోజు మద్యహ్నం 12 గంటలకి రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి డేట్ సెట్ చేసిన  విషయం మనకు టిముందుగాని తెలుసు. అయితే, ఇప్పుడు మరొక కొత్త వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే, ఒక 48MP ప్రధాన రియర్ కెమేరాతో రెడ్మి నాట్ 7 స్మార్ట్ ఫోన్ను, తక్కువధరతో చైనాలో విడుధల చేసి అందరిని ఆశ్చర్యపరిచిన షావోమి, ఇప్పుడు స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్మి నోట్ 7 ప్రో వేరియంట్ ని కూడా  ఇండియాలో విడుదల చేయనున్నదని కొన్ని లీక్స్ మరియు రూమర్లు చెబుతున్నాయి.

 దీనికి అనుగుణంగా,  ఈ ఫోన్ యొక్క ప్రో వేరియంట్ అయినటువంటి రెడ్మి నోట్ 7 ప్రో కూడా విడుదలకానున్నట్లు, ప్రముఖ టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ తన ట్విట్టర్ పేజీలో రెండర్లను గురించి వివరించారు. 

ఇషాన్ అగర్వాల్ ఏమి చేబుతున్నారంటే " మీరు ఎదురుచుగుస్తున్న దానికి గురించి కనర్మేషన్ ఇదిగో , 28 వ తేదికి షావోమి రెండు రెడ్మి లను విడుదల చేయనుంది. ఇవే రెడ్మి నోట్ 7 మరియు రెడ్మి నోట్ 7 ప్రో కి సంబంధించిన రెండర్లు! కొన్ని తేడాలను గుర్తించి ఉంటారు ?" అని తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.

ఇదేగనుక నిజమైతే, రేపు 4MP సోని IMX586 తో వుండనున్న కెమేరాగా చెబుతున్న రెడ్మి నోట్ 7 ప్రో కూడా ఇండియలో విడుదల చేయనున్నట్లు అర్ధమవుతుంది. కాబట్టి,  స్మార్ట్ ఫోన్ రాకకోసం ఎదురు చూస్తున్న వారికీ డబుల్ ధమాఖా అన్నమాట!.

ఈ చిత్రాల ప్రకారం, Redmi Note 7 Pro కూడా డ్యూయల్ -వెనుక కెమెరాలు మరియు వెనుక వేలిముద్ర సెన్సారుతో సెటప్ చేయబడుతుంది. అలాగే, వేనుక ప్యానెల్లో ఒక గ్రేడియంట్ ఫినిష్ కూడా కనిపిస్తుంది. రెడ్మి నోట్ 7 ప్రో ఇప్పటికే ఒక 48MP సోనీ IMX586 సెన్సార్ కలిగి రానున్నట్లు ధ్రువీకరించబడింది మరియు 6GB RAMతో  ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. రెడ్మి CEO, లూ వెయిబింగ్, ఇటీవల ఈ స్మార్ట్ ఫోన్ను 2,000 యువాన్లకు (21,222 రూపాయల కన్నా తక్కువ ధరకే) అందించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఒకవేళ ఇదేగనుక నిజమైతే, ప్రస్తుతం ఉన్నవాటిలో అత్యంత ఖరీదైన రెడ్మి ఫోనుగా ఇది ఉంటుంది.

Redmi Note 7 Pro  గురించి మునుపటి నివేదికలు, ఇది Snapdragon 675 SoC ద్వారా ఆధారితంగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ త్వరలోనే విడుదల చేయబడుతుంది మరియు ఫిబ్రవరి 28 న భారతదేశంలో జరగనున్న లాంచ్ ఈవెంట్ లో, ఇది రెడ్మి నోట్ 7 ప్రకటించనున్నట్లు ఇప్పటికే ధ్రువీకరించింది. అయితే, ప్రస్తుత లీక్స్ ఈ రెడ్మి నోట్ 7 ప్రో ని కూడా అదే రోజు  ప్రకటిస్తుంది అని అంచనాలను పెంచుతుంది.

చిత్ర మూలం : ఇషాన్ అగర్వాల్ ట్విట్టర్ పేజ్

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo