48MP + పంచ్ హోల్ డిస్ప్లే : ఈ ఫిచర్లతో రానున్న మోటో వన్ విజన్

48MP + పంచ్ హోల్ డిస్ప్లే : ఈ ఫిచర్లతో రానున్న మోటో వన్ విజన్
HIGHLIGHTS

మోడల్ సంఖ్య XT1970-1 మరియు Android Pie పైన నడుస్తున్న జాబితాలో ఉంచబడింది.

మోటరోలా యొక్క వన్ విజన్ గురించి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది, ఇప్పుడు ఈ ఫోన్ గురించి ఇంటర్నెట్లో అనేక రూమర్లుచక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ముందుగా టైగర్ మొబైల్స్  ద్వారా వెల్లడైంది, ఒక తాజా చిత్రంఈ ఫోన్ యొక్క పైన ఎడమ పైపు మూలలో సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ డిస్ప్లే కలిగివున్నట్లుగా  చూపిస్తుంది. అలాగే, ఈ డిస్ప్లేలో మూడు వైపులా చిన్న బెజల్స్ మరియు సాపేక్షంగా మందపాటి చిన్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక 48MP వెనుక కెమెరా కలిగిన స్మార్ట్ ఫోనుగా చూపిస్తుంది.

సెల్ఫీ కెమెరా యొక్క రిజల్యూషన్ గురించిన ఎటువంటి నిర్ధారన ఈ నివేదిక తెలియచేయనప్పటికీ, మునుపటి నివేదికలు ఈ 48MP కెమెరా ఒక డ్యూయల్ కెమెరా సెటప్పుతో రానున్నట్లు మరియు ఒక ప్రెస్ రెండర్ ఊహాజనిత నిర్ధారణను ధృవీకరిస్తుంది. అధనంగా, ఈ డ్యూయల్ కెమెరా సెటప్, ఒక డ్యూయల్ – LED ఫ్లాష్ తో పైభాగంలో ఎడమవైపు నిలువుగా ఉంచబడుతుంది. ఈ కెమెరా మాడ్యూల్ పక్కన "48MP కెమెరా" టెక్స్ట్ ఉంది. ఇక బ్యాక్ ప్యానెల్ పైన బ్యాట్-వింగ్ లోగోలో వేలిముద్ర స్కానర్ మరియు Android One బ్రాండింగ్ కూడా ఉంది.

motorola one vision intext.jpg

ఈ చిత్రం కుడివైపున ఒక స్పీకర్ మరియు ఎడమవైపు ఒక  మైక్రోఫోనుతో,ఇంకా దిగువన ఒక USB-C పోర్ట్ను ఈ ఫోన్లో చూపిస్తుంది. ఈ వన్ విజన్ ఎడమవైపు అంచున ఒక సిమ్ కార్డు స్లాట్ను కలిగి ఉంటుంది, మరియు వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ను కుడివైపు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క లాక్ స్క్రీన్,  ఏప్రిల్ 3 తేదీన ఈ ఫోన్ అధికారికంగా వెల్లడించవచ్చు అన్నట్లుగా సూచించే తేదీని చూపిస్తుంది. ఇంకా, దిగువన ఉన్న ఒక మాత్ర ఆకారంలో ఉన్న బటన్ ఈ ఫోన్ను Android Pie OS తో అమలు అవుతున్నట్లు చెబుతోంది.

ఈ ఫోన్, ఇప్పటికే గీక్బెంచ్ లో  కనిపించింది మరియు సింగిల్ టెస్ట్ లో 1599 స్కోరును మరియు బహుళ కోర్ టెస్టులో 5328 స్కోరును వరుసగా సాధించింది. ఈ ఫోన్ కూడా "Wi-Fi అలయన్స్ వెబ్సైట్" లో ఒక మోడల్ సంఖ్య XT1970-1 మరియు Android Pie  పైన నడుస్తున్న జాబితాలో ఉంచబడింది. ఒక 21: 9 యొక్క ఆస్పెక్టు రేషియోని అందించే డిస్ప్లేతో, ఈ ఫోన్ రానుంది. ఇది 32 GB/64GB / 128GB స్టోరేజ్  మరియు 3GB / 4GB RAM మోడల్లతో పాటు Exynos 9610 SoC యొక్క శక్తితో ఈస్మార్ట్ ఫోన్ పనిచేయనున్నట్లు తెలియచేయబడింది. ఈ మోటరోలా వన్ విజన్ ఒక 3,500mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లో, ఈ ఫోన్ 12MP యొక్క డిఫాల్ట్ చిత్రాన్ని తీసుకోవడంతో ఒక కెమెరా కలిగి ఉంది, కానీ రెడ్మి నోట్ 7 వలె, అదే 48MP గా మార్కెట్ చేయబడుతుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo