Lava Shark 5G: రూ. 7,999 ధరలో వచ్చిన లావా 5జి టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకుని Lava Shark 5G స్మార్ట్ ఫోన్ అందించింది
ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ధరతో మార్కెట్లో ప్రవేశపెట్టింది
చవక ధరలో వచ్చిన లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్
Lava Shark 5G: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా అతి తక్కువ ధరలో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ధరతో మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకుని లావా ఈ స్మార్ట్ ఫోన్ అందించింది. చవక ధరలో వచ్చిన లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇక్కడ అందిస్తున్నాను.
SurveyLava Shark 5G: టాప్ 5 ఫీచర్స్
డిజైన్
లావా ఈ ఫోన్ ను చాలా ప్రీమియం లుక్స్ కలిగిన డైమండ్ స్పార్కిల్ డిజైన్ తో అందించింది. ఇది ప్రీమియం లుక్స్ అందించే గ్లాస్ డిజైన్ తో వస్తుంది మరియు కేవలం 8.2mm తో సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ స్టెల్లార్ గోల్డ్ మరియు స్టెల్లార్ బ్లూ రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది.
డిస్ప్లే
ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ నోచ్ HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.5D స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది 260 PPI (పిక్సెల్స్ పర్ ఇంచ్) మరియు 16M కలర్ డెప్త్ తో కూడా వస్తుంది.
పెర్ఫార్మెన్స్
ఈ ఫోన్ Unisoc T756 బడ్జెట్ 5G ప్రోసెసర్ కలిగి ఉంటుంది. దానికి జతగా 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 4GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో టోటల్ 8GB ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ 4 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది.

కెమెరా
ఈ ఫోన్ లో 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా 5MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ Slow Motion, Timelapse, మోషన్ ఫోటో, HDR, నైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
బ్యాటరీ
ఈ లేటెస్ట్ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీతో ఈ ఫోన్ 30 గంటల టాక్ టైమ్, 340 గంటల స్టాండ్ బై లేదా 10 గంటల యూట్యూబ్ వీడియో వీక్షణ అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ కేవలం 10W ఛార్జ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుంది.
Also Read: Jio New Plans: రూ. 48 ప్రారంభ ధరతో 5 కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన జియో.!
Lava Shark 5G: ప్రైస్ అండ్ సేల్
లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ముందుగా కొనుగోలు చేసిన వారికే ఈ ధరకు లభిస్తుందని లావా చెబుతోంది. ఈ ఫోన్ లావా అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile