Lava O2 launch: కొత్త ఫోన్ లాంఛ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన లావా.!
లావా శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లో విడుదల చేస్తోంది
భారీ ఫీచర్స్ తో అతి తక్కువ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది లావా
ఈరోజు కొత్త ఫోన్ Lava O2 ప్రస్తావనను తీసుకు వచ్చింది
Lava O2: ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లో విడుదల చేస్తోంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లకు పోటీగా భారీ ఫీచర్స్ తో అతి తక్కువ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది లావా. ఇటీవలే చాలా చవక ధరలో 3D Curved డిజేసిన మరియు డిస్ప్లేతో లావా బ్లేజ్ కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ సేల్స్ కి వచ్చిన వెంటనే మరొక కొత్త ఫోన్ లాంఛ్ చేయబోతున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
SurveyLava O2 launch:
లావా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈరోజు కొత్త ఫోన్ ప్రస్తావనను తీసుకు వచ్చింది. లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లావా O సిరీస్ నుండి వచ్చిన O1 నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ లావా O2 ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. కానీ, ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో తెలియపరిచే టీజర్ వీడియోను మాత్రం షేర్ చేసింది.
The Game is about to get Real#O2 – Coming Soon#LavaMobiles #ProudlyIndian pic.twitter.com/gRxLns7PyV
— Lava Mobiles (@LavaMobile) March 15, 2024
ఈ వీడియో కేవలం 12 సెకన్ల నిడివి మాత్రమే వుంది. అయితే, ఇంత తక్కువ సమయంలోనే ఈ ఫోన్ ఎలా ఉంటుందో అనే వివరాల గురించి హింట్ ఇచ్చింది.
Lava O2 ఎలా వుంది?
ఈ ఫోన్ చాలా సన్నగా రౌండ్ కార్నర్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ వెనుక అడుగు భాగంలో లావా బ్రాండింగ్ కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమేరా బంప్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. అయితే, ఈ కెమేరా వివరాలు కనిపించకుండా బ్లర్ చేసింది. అయితే, లావా O సిరీస్ సరసమైన స్మార్ట్ ఫోన్ సిరీస్ కాబట్టి ఈ ఫోన్ ప్రైస్ & ఫీచర్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.

కానీ, ఈ ఫోన్ వీడియో ద్వారా ఈ ఫోన్ 50 MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇది మన అంచనా మాత్రమే దీని పైన కంపెనీ ఎటువంటి వివరాలను అందించ లేదని గుర్తుంచుకోవాలి.
Also Read: Vu Soundbar Smart TV పైన ధమాకా ఆఫర్ అందించిన అమేజాన్..!
ఇక ఈ ఫోన్ యొక్క ఇతర వివరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ అడుగు భాగంలో Type-C ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తోంది. అంతేకాదు, ఛార్జ్ పోర్ట్ కి ప్రక్కనే పెద్ద స్పీకర్ గ్రిల్ కనిపిస్తోంది. ఈ ఫోన్ గురించి లావా అందించిన టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ కెమేరా ప్రత్యేకమైన ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ గురించి జస్ట్ ఇప్పుడే కదా టీజింగ్ మొదలు పెట్టింది, త్వరలోనే ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను అందించే అవకాశం ఉంటుంది. చూద్దాం, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా O2 ఎటువంటి వివరాలను కలిగి ఉంటుందో అని.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile