Lava Bold N4 Lite launched with unbelievable launch price
Lava Bold N4 Lite స్మార్ట్ ఫోన్ ని ఈరోజు మార్కెట్ లో పరిచయం చేసింది. ఈ కొత్త ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్రెండ్ ను ఫాలో కాకుండా రిలీజ్ చేయడం విశేషం. ఈ లేటెస్ట్ లావా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఎలా ఉన్నాయో చూద్దామా.
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదల చేసింది. ఇది ఒరిజినల్ ధర కాదు, ఇందులో బ్యాంక్ ఆఫర్ ని కూడా జత చేసిందని గమనించాలి. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ గోస్ట్ సిల్వర్ మరియు ఎంపైర్ గోల్డ్ అనే రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది.
లావా ఈ ఫోన్ ను లేటెస్ట్ అండ్ బోల్డ్ ఫినిష్ తో చూడగానే ఆకట్టుకునే రూపం లో అందించింది. ఈ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇందులో HD రిజల్యూషన్ కలిగిన 6.56 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ తక్కువ అంచులు కలిగి ఉంటుంది మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.
లావా ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ లో Unisoc 9863A ఆక్టా కోర్ 4జి చిప్ సెట్ ని అందించింది. అలాగే, ఇందులో 3 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్ మాత్రం అందించింది. కానీ ఈ ప్రైస్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడమే కష్టంగా ఉంది కాబట్టి, ఇది రీజనబుల్ ఫార్మాట్ గానే కనిపిస్తుంది. అంతేకాదు, 3 జీబీ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని కూడా అందించింది.
Also Read: Realme C100i సైలెంట్ గా లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఇక ఈ ఫోన్ కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 8MP సింగల్ రియర్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇది FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు HD ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని నార్మల్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. లావా ఈ స్మార్ట్ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ సౌలభ్యాన్ని అందించింది.