Lava Bold N4 Lite launch date announced
Lava Bold N4 Lite: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. లావా బోల్డ్ ఎన్4 లైట్ పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఇటీవల బడ్జెట్ ధరలో విరాట్ వి1 సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన లావా, ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
లావా బోల్డ్ ఎన్4 లైట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 27న లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ వివరాలు అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. అంటే, లావా ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా సేల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. లావా ఇటీవల లాంచ్ చేసిన ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేసింది.
లావా బోల్డ్ ఎన్4 లైట్ స్మార్ట్ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ ఫీచర్స్ లేదా పూర్తి డిజైన్ ను వెల్లడించే ఇమేజ్ ఇమేజ్ లేదా వివరాలు అందించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ మెటల్ లాంటి డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్రాప్ అండ్ షాక్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అంటే, లావా ఈ ఫోన్ ను మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్ తో అందిస్తుంది.
ఇది కాకుండా ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో చూపించింది. అలాగే, ఇందులో టైప్ C ఛార్జ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ మాత్రమే టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ త్వరలో రివీల్ చేసే అవకాశం ఉంది.
Also Read: iQOO Buds: బడ్జెట్ ధరలో కొత్త బడ్స్ లాంచ్ చేసిన ఐకూ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అవేమిటంటే, లావా ఈ ఫోన్ ను పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ వంటి ఫీచర్స్ ఆశించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లావా ఈ ఫోన్ ఫీచర్స్ ని అఫీషియల్ గా రివీల్ చేసిన తర్వాత వీటిలో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.