Lava Bold N2 5G : లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

Lava Bold N2 5G కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది

గత సంవత్సరం విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 2 ఫోన్ యొక్క 5జి వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

Lava Bold N2 5G: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గత సంవత్సరం విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 2 ఫోన్ యొక్క 5జి వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. బోల్డ్ సిరీస్ నుంచి రీసెంట్ గా బోల్డ్ ఎన్ 1 5జి ఫోన్ ను కూడా విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు అందించిన అన్ని ఫోన్లు కూడా బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే టీజర్ విడుదల చేసింది.

Lava Bold N2 5G : లాంచ్ డేట్

లావా బోల్డ్ ఎన్ 2 5జి స్మార్ట్ ఫోన్ జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ అందించి ఈ ఫోన్ గురించి లావా టీజింగ్ చేస్తోంది.

Lava Bold N2 5G : ఫీచర్స్

లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాలు తెలిపేలా టీజర్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్నట్లు తెలిసేలా చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు వెనుక గ్లాసీ డిజైన్ ఉంటుంది.

ఈ ఫోన్ ను యాడ్స్ గొడవ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ వివరాలు మాత్రమే లావా రివీల్ చేసింది. అయితే, నెట్టింట్లో ఈ ఫోన్ లీక్డ్ మరియు రూమర్ ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: BSNL 107 Plan వ్యాలిడిటీ మరోసారి తగ్గించిన బిఎస్ఎన్ఎల్.!

లావా బోల్డ్ ఎన్ 2 5G : లీక్డ్ ఫీచర్స్

లావా బోల్డ్ ఎన్ 2 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 ఇంచ్ HD+ IPS LCD డిస్‌ప్లే తో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతన్నాయి. ఈ ఫోన్ ను కూడా లేటెస్ట్ Unisoc 5G చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రావచ్చని రూమర్లు ఉన్నాయి.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ కెమెరా Ai కెమెరా ఫీచర్స్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఫోన్ లాంచ్ తర్వాత ఈ లీక్స్ లో ఎన్ని నిజం అవుతాయో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :