Lava Bold N2 5G : లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!
Lava Bold N2 5G కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది
గత సంవత్సరం విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 2 ఫోన్ యొక్క 5జి వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
Lava Bold N2 5G: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గత సంవత్సరం విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 2 ఫోన్ యొక్క 5జి వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. బోల్డ్ సిరీస్ నుంచి రీసెంట్ గా బోల్డ్ ఎన్ 1 5జి ఫోన్ ను కూడా విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు అందించిన అన్ని ఫోన్లు కూడా బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే టీజర్ విడుదల చేసింది.
SurveyLava Bold N2 5G : లాంచ్ డేట్
లావా బోల్డ్ ఎన్ 2 5జి స్మార్ట్ ఫోన్ జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ అందించి ఈ ఫోన్ గురించి లావా టీజింగ్ చేస్తోంది.
Lava Bold N2 5G : ఫీచర్స్
లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాలు తెలిపేలా టీజర్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్నట్లు తెలిసేలా చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు వెనుక గ్లాసీ డిజైన్ ఉంటుంది.

ఈ ఫోన్ ను యాడ్స్ గొడవ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ వివరాలు మాత్రమే లావా రివీల్ చేసింది. అయితే, నెట్టింట్లో ఈ ఫోన్ లీక్డ్ మరియు రూమర్ ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: BSNL 107 Plan వ్యాలిడిటీ మరోసారి తగ్గించిన బిఎస్ఎన్ఎల్.!
లావా బోల్డ్ ఎన్ 2 5G : లీక్డ్ ఫీచర్స్
లావా బోల్డ్ ఎన్ 2 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 ఇంచ్ HD+ IPS LCD డిస్‌ప్లే తో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతన్నాయి. ఈ ఫోన్ ను కూడా లేటెస్ట్ Unisoc 5G చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రావచ్చని రూమర్లు ఉన్నాయి.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ కెమెరా Ai కెమెరా ఫీచర్స్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఫోన్ లాంచ్ తర్వాత ఈ లీక్స్ లో ఎన్ని నిజం అవుతాయో చూడాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
