అతి చవక 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన లావా.!

అతి చవక 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన లావా.!
HIGHLIGHTS

IMC 2022 నుండి అతి చవక 5G ఫోన్ గా Lava Blaze 5G పరిచయం

ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది

ప్రస్తుతానికి ఈ లావా బ్లేజ్ 5G ఫోన్ ధర పైన క్లారిటీ లేదు

ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా IMC 2022 నుండి అతి చవక 5G ఫోన్ గా Lava Blaze 5G ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తుండగా లావా ఎట్టకేలకు ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. నిన్నటి వరకూ నవంబర్ 3 న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ఆన్లైన్లో న్యూస్ చక్కర్లు కొత్తగా, ఈరోజు చేసిన అధికారిక ప్రకటనతో అందరి నోటికి తాళం పడింది. ఈ ఫోన్ ను నవంబర్ 7 న అమెజాన్ ద్వారా లాంచ్ చేస్తున్నట్లు లావా ట్విట్టర్ సాక్షిగా తెలిపింది.                

Lava Blaze 5G: ధర

వాస్తవానికి, ప్రస్తుతానికి ఈ లావా బ్లేజ్ 5G ఫోన్ ధర పైన క్లారిటీ లేదు. అయితే, ఈ ఫోన్ ను భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకొని వస్తోంది కాబట్టి, సుమారు 10,000 రూపాయల ధరలో ఈ ఫోన్ రేటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo