Lava Agni 3 5G పై రూ. 4,000 తగ్గింపు అందించిన లావా.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.!
Lava Agni 3 5G పై రూ. 4,000 రూపాయల భారీ తగ్గింపు ఆఫర్
డ్యూయల్ AMOLED స్క్రీన్ తో ఫోన్ ఇప్పుడు చాలా చవక రేటుకే లభిస్తుంది
వలం రూ. 15,998 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు
Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రూ. 4,000 రూపాయల భారీ తగ్గింపు ఆఫర్ ను అందించింది. ఇండియన్ మార్కెట్లో డ్యూయల్ AMOLED స్క్రీన్ తో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు చాలా చవక రేటుకే లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 15,998 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. లావా మరియు అమెజాన్ అందించి ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డీల్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyLava Agni 3 5G: ఆఫర్స్
లావా అగ్ని 3 5జి స్మార్ట్ ఫోన్ ను లావా ఇండియాలో రూ. 20,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC, Federal మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ముందెన్నడూ చూడని విధంగా కేవలం రూ. 15,998 రూపాయల అతి చవక రేటుకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ మార్చి 10 వ తేదీతో ముగుస్తుంది. Buy From Here
Also Read: భారీ డిస్కౌంట్ తో JVC QLED Smart tv ని 15 వేల ధరలోనే అందుకోండి.!
Lava Agni 3 5G: ఫీచర్స్
ఈ లావా స్మార్ట్ ఫోన్ డ్యూయల్ AMOLED స్క్రీన్ కలిగిన ఎం మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ లో HDR సపోర్ట్ కలిగిన 6.78 3D Curved AMOLED ప్రధాన స్క్రీన్ మరియు వెనుక మరొక చిన్న Mini AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ మెయిన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1.5K రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది.

ఈ లావా స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ (OIS + EIS), 8MP టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు 3X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ లావా ఫోన్ మీడియాటెక్ Dimensity 7300X చిప్ సెట్ జతగా 8GB LPDDR5 ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile