Lava Agni 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజులుగా టీజింగ్ మొదలు పెట్టిన లావా, ఈరోజు ఈ ఫోన్ కలర్ వేరియంట్ వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ కోసం లాంచ్ సందర్భంగా అందించిన కొత్త టీజర్ పోస్ట్ నుంచి ఈ డిటైల్స్ అందించింది. ఈ ఫోన్ సూపర్ ఫినిష్ మెటల్ ఫ్రేమ్ మరియు న్యూ కలర్ తో లాంచ్ అవుతోందని లావా కన్ఫర్మ్ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Lava Agni 4 : కొత్త అప్డేట్
లావా అగ్ని 4 లాంచ్ కోసం ఈరోజు కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి అందించిన కొత్త ట్వీట్ ద్వారా ఈ వివరాలు అందించింది. ఈ ట్వీట్ లో ఈ ఫోన్ ను సరికొత్త లూనార్ మిస్త్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్ లో అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ వివరాలు వెల్లడించేలా ఈ కొత్త టీజర్ ఇమేజ్ వుంది. ఈ కొత్త ఇమేజ్ లో ఈ ఫోన్ కెమెరా సెటప్ మరియు ఇతర వివరాలు కనిపిస్తాయి.
లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈరోజు విడుదల చేసిన ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఈ ఫోన్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఫోన్ సైడ్ లో వాల్యూమ్ బటన్, పవర్ బటన్ మరియు ఫోన్ అడుగున ప్రత్యేకమైన బటన్ కూడా ఉంది. ఇది AI కోసం అందించిన బటన్ లేదా కెమెరా కోసం అందించిన ప్రత్యేకమైన బటన్ అయ్యే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, లావా ఈ ఫోన్ లో అందించిన ప్రత్యేకమైన బటన్ గురించి వివరాలు ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు.
ఈ ఫోన్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండే యాంటెన్నా సెటప్ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చే ఫోన్ గా అనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అంతేకాదు, ఈ కెమెరాకి రెండు వైపులా నోటిఫికేషన్ కోసం జిఫ్ లైట్ సెటప్ ఉన్నట్లు కూడా అర్ధం అవుతుంది. ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ నవంబర్ 20వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.